Monday, May 6, 2024

యూఎస్ వెళ్లే విద్యార్థుల‌కు బ్యాడ్ న్యూస్‌.. ప్రాసెసింగ్ ఫీజు పెంచిన అమెరికా

యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికా బ్యాడ్ న్యూస్ చెప్పింది. స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ పెంచుతున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల అప్లికేషన్ ఫీజు పెంచడం వల్ల అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఆ మేరకు ఖర్చు పెరగనుంది. ఈ ఏడాది మే 30 నుంచి పెంచిన ప్రాసెసింగ్ ఫీ అమల్లోకి రానుందని వెల్లడించారు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారులు. విజిటర్, టూరిస్ట్, బిజినెస్, స్టూడెంట్, ఎక్స్‌ఛేంజ్ విజిటర్ వీసాలన్నింటికీ ఇది అమలు కానుంది.

- Advertisement -

అయితే.. ఎక్స్‌ఛేంజ్ విజిటర్‌ వీసాలకు సంబంధించిన రెండేళ్ల రెసిడెన్సీ ఫీ సహా ఇతర కాన్సులర్ ఫీలలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. 2022 అక్టోబర్ 1 నుంచి వీసా అప్లికేషన్‌ పెట్టుకున్న వాళ్లందరికీ ఈ పెంచిన ఫీలు అమలవుతాయని వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఇది అమలు కానుంది. పిటిషన్‌ బేస్డ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ కూడా పెరగనుంది.

“ఈ ఏడాది మే 30 నుంచి విజిటర్ వీసాలు, బిజినెస్/టూరిజం వీసాలతో (B1/B2)పాటు స్టూడెంట్, ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసాల ఫీ పెరగనుంది. ప్రస్తుతం ఈ రుసుము 160 డాలర్లుగా ఉంది. దీన్ని 185 డాలర్లకు పెంచుతున్నాం”

-యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement