Monday, April 29, 2024

అనుష్క కమ్‌బ్యాక్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఫిక్స్

టాలీవుడ్ స్టార్ నటి అనుష్క, నవీన్ పోలి శెట్టితో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాకి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అని టైటిల్ ఫిక్స్ చేయగా.. ఈ మూవీతో ఇండస్ట్రీలోకి మంచి కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది స్వీటీ. తాజా సంచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ZEE5 మంచి ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లేదా మేకర్స్ ఈ వార్తలను ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.

ఇటీవ‌ల విడుద‌లైన ఫస్ట్ సింగిల్‌కి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతుండగా యువి క్రియేషన్స్ నిర్మాణ బాద్యతలు చేపట్టింది. ఈ సినిమాకి రధన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement