Thursday, May 2, 2024

సాయి ధరమ్ తేజ్ ‘‘విరూపాక్ష’’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ & వెన్యే ఫిక్స్..

కార్తిక్ దండు దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘విరూపాక్ష’. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోెంది. కాగా, ఈ మూవీకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏలూరులోని CR రెడ్డి కాలేజ్ లో ఈ నెల (ఏప్రిల్) 16న నిర్వహించనున్నట్లు తెలిపారు.

సాయంత్రం 5 గంటల నుండి ఈ వేడుక ప్రారంభం కానున్నట్లు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 21 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement