Monday, April 29, 2024

ఓటీటీలో ‘రంగమార్తాండ’ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్.. టాప్ 10 లిస్ట్‌లో నెం.1

టాలీవుడ్ సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం నటించిన మూవీ ‘రంగమార్తాండ’. ఈ సినిమా రెండు రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. కాగా, కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఓటీటీ స్పేస్‌లో కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. భారతదేశంలోని అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 సినిమాల విభాగంలో ఈ మూవీ ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది.

హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సీనియన్ నటుడు రాజశేకర్ కూతురు శివాత్మిక రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement