Saturday, February 4, 2023

AP | లాసెట్‌ అడ్మిషన్స్ షెడ్యూల్‌ విడుదల.. మూడు, ఐదు సంవత్సరాల ఎల్ ఎల్ బీ కోర్సుల్లో ప్ర‌వేశాలు

అమరావతి,ఆంధ్రప్రభ: ఏపీ లాసెట్‌ ద్వారా మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సులోకి ప్రవేశం కోరే వారికి అడ్మిషన్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. శుక్ర‌వారం అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. మూడు నుండి పదో తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. నాలోగో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. పన్నెండో తేదీన స్పెషల్‌ కేటగిరి అభ్యర్ధుల సరిఫికెట్లను ఫిజికల్‌గా నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహిస్తారు.

- Advertisement -
   

పదమూడో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు వెబ్‌ ఆప్షన్స్‌ను నిర్వహిస్తారు. పదహారో తేదీన వెబ్‌ అప్షన్స్‌ మార్చుకునే అవకాశం ఇస్తారు. 19వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. పందోమ్మిది నుంచి 23వ తేదీ లోపు కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలి. 21వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమౌతాయి. ఈమేరకు బుధవారం ఎపి ఉన్నత విద్యా మండలి పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement