Thursday, May 2, 2024

మహిళా శ్రామిక శక్తిలో ఏపీ నెంబర్ 1.. స్కిల్ ఇండియా 2023 నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలోనే అత్యధిక మహిళా శ్రామిక శక్తి ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. స్కిల్ ఇండియా 2023 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కేవలం మహిళా శ్రామిక శక్తిలోనే కాదు, అత్యధిక నైపుణ్యాలు కలిగిన నిపుణులు ఇంటర్న్‌షిప్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉందని ఈ నివేదిక తేల్చింది. ఇంటర్న్‌షిప్ కోరుతున్నవారు ఏపీలో 93.50 శాతం ఉండగా, ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ 93.22 శాతం, ఝార్ఖండ్ 92.98, కర్ణాటక 91.62 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) భాగస్వామ్యంతో వీబాక్స్ సంస్థ ఆన్‌లైన్ సర్వే జరిపి ఈ నివేదికను రూపొందించింది. మహిళా నైపుణ్య శక్తిలో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి.

- Advertisement -

ఉన్నత విద్యా విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పుల ఫలితంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులను మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా తయారుచేయగల్గినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా విద్యావిధానంలో నైపుణ్య శిక్షణను కూడా భాగం చేస్తూ, డిగ్రీ పట్టా చేతికందే సమయానికే ఉద్యోగం చేయగలిగే సామర్థ్యంతో యువతను సిద్ధం చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలిపింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement