Wednesday, May 8, 2024

HCAపై మ‌రో కేసు న‌మోదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ‎పై మరో కేసు నమోదైంది. భారత్ -ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లు విక్రయం, తొక్కిసలాటపై ఇప్పటికే మూడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా హెచ్‎సీఏపై మరో కేసును బేగంపేట పోలీసులు నమోదు చేశారు. మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం, మ్యాచ్ ప్రారంభానికి వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో హెచ్‎సీఏ తప్పుడు టైమింగ్ ఇచ్చిందని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హెచ్‎సీఏపై ఇప్పటివరకు మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement