Thursday, May 16, 2024

Ap News: నేతన్నల అకౌంట్‌లో రూ.24వేలు జమ

ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులను విడుదల చేసింది. ఈ మేరకు సొంత మగ్గం కలిగిన నేతన్నలకు నిధులు విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఏపీలో ఈ పథకం కింద దాదాపుగా 80 వేల మంది చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతోందన్నారు. ఈ పథకం కోసం రూ.192.08 కోట్లు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి సహాయం అందిస్తున్నామని, అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి వెంటనే నమోదు చేసుకోవాలని.. నెలరోజుల్లో తనిఖీలు పూర్తి చేసి వారికి కూడా రూ.24వేలు అందిస్తామని జగన్ తెలిపారు.

మగ్గం మీద బతుకుతున్న చేనేత కుటుంబానికి అక్షరాల రూ.24వేల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. 2 సంవత్సరాల 2 నెలల్లో వరుసగా మూడో విడత నేతన్న నేస్తం డబ్బులు విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు కన్నా… చేనేతలు బతకడానికి పడుతున్న ఇబ్బందులు ఎక్కువ అని భావించి.. ఈ 80వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు.ఇలా ఏటా దాదాపుగా రూ.200 కోట్లు చొప్పున 5 ఏళ్ల కాలంలో రూ.1000 కోట్లను కేవలం నేతన్న నేస్తం ద్వారానే ఇస్తున్నామని జగన్ వివరించారు.

ఈ వార్త కూడా చదవండి: జగన్ ప్రభుత్వానికి కేంద్రం మరో ఝలక్

Advertisement

తాజా వార్తలు

Advertisement