Monday, April 29, 2024

యంగ్ లుక్ లో మెగాస్టార్…ఫొటోస్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు దగ్గరపడుతోంది. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. అయితే ప్రతిసారిలానే ఈ ఏడాది కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరు. కాగా మెగాస్టార్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ డాషింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ఇది బర్త్ డే స్పెషలా లేక వేరే కొత్త సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ ఆ అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మెగా స్టార్ బర్త్ డే రోజు ఆయన సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement