Saturday, April 27, 2024

దాక్షాయ‌నిగా ‘అన‌సూయ‌’..పుష్ప లుక్ అదుర్స్..

యాంక‌ర్,న‌టి అన‌సూయ పుష్ప చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌ని పోషిస్తోంది. పుష్ప సినిమాలో అనసూయ… దాక్షాయని పాత్రలో కనిపించనుంది. ఈ మేర‌కు దాక్షాయని ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ లుక్ లో అనసూయ.. చాలా మాసివ్ గా క‌నిపించింది. ఒంటినిండా నగలు వేసుకుని..ఊర మాస్‌ లుక్‌ లో క‌నిపించింది. సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న ప్ర‌ధాన పాత్ర‌ల‌ని పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 17 వ తేదీన విడుదల చేయ‌నున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement