Sunday, May 19, 2024

PAK vs SA : ఐడెన్ మార్క్రామ్ ఒంట‌రి పోరాటం.. సౌతాఫ్రికా ఖాతాలో మ‌రో విజ‌యం

వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇవ్వాల లో చెన్నై వేదికగా జ‌రిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా త‌మ ఖాతాలో మ‌రో విజ‌యాన్ని నమోదు చేసుకుంది. పాకిస్తాన్ తో జ‌రిగిన ఈ మ్యాచ్ లో 1 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకే ఆలౌట్ అయ్యి ఆశించిన స్థాయిలో లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. ఇక చేజింగ్ కు దిగిన సౌతాఫ్రికా జ‌ట్టు 48వ ఓవ‌ర్ల‌లో మ్యాచ్ ను ముగించేసింది.

ఇక‌, సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో ఐడెన్ మార్క్రామ్ ఒంట‌రి పోరాటం చేశాడు.. 91 ప‌రుగుల‌తో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన వారు కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, హరీస్ రౌఫ్ 2, మహ్మద్ వాసిమ్ 2, ఉసామా మీర్ 2 వికెట్లు దకకించుకున్నారు.

కాగా, అంత‌కముందు బ్యాటింగ్ చేసిన‌ పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో సౌద్ షకీల్ (52), బాబర్ ఆజమ్ (50) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక‌, షాదాబ్ ఖాన్ (43) ఫర్వాలేదనిపించాడు. వీరు మినహా మిగిలిన ప్లేయర్లు విఫలం అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో షమ్సీ 4 వికెట్లతో మెరిశాడు. మార్కో యాన్సెన్ 3 వికెట్లు సాధించాడు. కొట్జీకి 2 వికెట్లు దక్కాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement