Sunday, May 5, 2024

AUS vs NZ : ప్రపంచకప్‌లో మరో రసవత్తర సమరం.. రేపు న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా ఢీ

ఐసీసీ వ‌న్డే ప్రపంచకప్‌లో భగంగా రేపు (శ‌నివారం) మ‌రో రసవత్తమైన పోరు జ‌ర‌గ‌నుంది. ధర్మశాల వేదికగా మరో ప్రపంచకప్‌లో వరుస విజయాలతో మళ్లీ గాడినపడిన ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ మూడో స్థానంలో ఉండగా…. ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది.

ఈ మ్యాత్ తో సెమీఫైనల్‌ చేరడమే లక్ష్యంగా దూసుకుపోవాల‌ని ఆస్ట్రేలియా భావిస్తొంది. ఇక న్యూజిలాండ్ జ‌ట్టు కూడా ఒకే ఒక్క ఓటమితో మంచి ఫామ్‌లో ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య భీకర పోరు ఖాయమని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు.

అంచనా జ‌ట్లు..

- Advertisement -

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.

న్యూజిలాండ్ జట్టు: ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement