Saturday, May 18, 2024

TS | రాష్ట్రంలో ఐదు రోజుల‌పాటు వ‌ర్షాలు…

సూర్యుడి భ‌గ‌భ‌గ‌ల‌నుంచి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్ర‌జల‌కు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రానున్న ఐదురోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ అయింది. అయితే, కొన్ని జిల్లాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు చెప్పింది. కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్న‌ట్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement