Sunday, April 28, 2024

ఇండియన్ జేఈఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో ఫేయిల్ అయిన AI – చాట్‌జీపీటీ..

ప్రస్తుతం ఇంటర్నెట్ లో వరైల్ గా మారిన పేరు చాట్‌జీపీటీ. ఈ AI మోడల్ విశేషమైన సామర్థ్యాలతో తక్కువ వ్యవధిలోనే విస్తృతంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ చాట్‌జీపీటీ చేయలేనిది ఏమీ లేదు, ఎలాంటి స్క్రిప్ట్‌ని అయిన రాయగలదు, కష్టతరమైన ప్రశ్నపత్రాలను సైతం క్షణాల్లో పరిష్కరించగలదు అని ప్రపంచ వ్యాత్తంగా ఫుల్ వైరల్ అవుతోంది. అయితే, ప్రతిదీ చాట్‌జీపీటీకి ఈజీ కాదని తేలిపోయింది. AI-ఆధారిత చాట్‌జీపీటీ జేఈఈ ఎగ్జామ్ క్రాక్ చేయడంలో ఫెయిల్ అయింది.

కేవలం రెండు పేపర్‌లలో మొత్తం ప్రశ్నలలో 11 ప్రశ్నలను మాత్రమే పరిష్కరించింది. దీంతో JEE అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌ని క్లియర్ చేయడం AI-ఆధారిత చాట్‌జీపీటీ కి కూడ అంత ఈజీ కాదని నిరూపితమైంది. JEE అడ్వాన్స్‌డ్ పరీక్షలో చాట్‌జీపీటీకి ఎదురుదెబ్బ తగలడంతో అత్యంత అధునాతన AI మోడల్‌కు పరిమితులు ఉన్నాయనే విషయం అర్థమవుతోంది.

అయితే ముఖ్యంగా, EE అడ్వాన్స్‌డ్ పరీక్షలో విఫలమైనప్పటికీ.. NEET పరీక్షలోని జీవశాస్త్ర విభాగంలో మాత్రమే చాట్‌జీపీటీ అద్భుతంగా ప్రశ్నలకు సమాధానమిచ్చింది. NEET పరీక్షలో చాట్‌జీపీటీ పర్ఫార్మెన్స్ ఇతర రంగాలలో రాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని సూచిస్తుంది. అయితే, క్లిష్టమైన టాస్కులను పూర్తి చేయడంలో మానవ మేధస్సుతో సమానంగా లేదనే విషయాన్ని గమనించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement