Thursday, May 2, 2024

టెలివిజన్ ప్రీమియర్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘వేధ’

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ లేటెస్ట్ రియలిస్టిక్ యాక్షన్ డ్రామా మూవీ ‘వేధ’. హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా శాండల్‌వుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో మంచి రివ్యూస్ ని దక్కించుకుంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తెలుగు-డబ్బింగ్ వెర్షన్ ఈ నెల (ఏప్రిల్) 16న జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ కానుంది.

థియేటర్లలో మిస్ అయిన వారు ఈ సినిమాని ఇప్పుడు చిన్న స్క్రీన్‌లలో చూడవచ్చు. గీతా పిక్చర్స్, జీ స్టూడియో పతాకాలపై గీతా శివ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ మూవీలో గానవి లక్ష్మణ్, ఉమాశ్రీ, అదితి సాగర్, శ్వేతా చంగప్ప, వీణా పొన్నప్ప, రఘు శివమొగ్గ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి అర్జున్ జన్య మ్యూజిక్ కంపోజర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement