Thursday, May 16, 2024

యువ‌త‌ – దేశానికి..స‌మాజానికి సేవ చేసేందుకే అగ్నిప‌థ్ -సీఎం యోగి

ప్ర‌ధాని మోడీ ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా అగ్నిప‌థ్ ప‌థ‌కం యువ‌త‌ను దేశానికి ..స‌మాజానికి సేవ చేయ‌డానికి సంసిద్ధం చేస్తుంద‌న్నారు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్. పోలీసు డిపార్ట్ మెంట్స్ లో జ‌రిగే రిక్రూట్ మెంట్స్ లో అగ్నివీర్ కి ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. నాలుగేళ్ల పాటు అగ్నివీర్స్ గా ప‌ని చేసి తిరిగి వ‌చ్చిన వారికి పోలీసు, పోలీసు అనుబంధ దళాలలో ప్రాధాన్యత ఇస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట అగ్నిప‌థ్ ప‌థ‌కం ప్రారంభించింది. ఇండియ‌న్ ఆర్మీ, ఇండియ‌న్ నేవీ, ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ల ఆధ్వ‌ర్యంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప‌థ‌కాన్ని లాంచ్ చేశారు. ఈ ప‌థ‌కం కింద మూడు ద‌ళాల్లో నాలుగేళ్ల పాటు యువ‌త‌ను రిక్రూట్ చేసుకుంటారు. ఇందులో రిక్రూట్ అయిన అభ్య‌ర్థుల‌ను అగ్నివీర్స్ అని పిలుస్తారు. ఇలా నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవ‌లందించిన అగ్నీవ‌ర్స్ లో 25 శాతం మందిని రెగ్యులర్ గా తీసుకుంటారు. మిగిలిన 75 శాతం అగ్నివీర్ లను పాక్యేజీ ఇచ్చి పంపించేస్తారు. అయితే వీరు ఇంటికి వ‌చ్చిన త‌రువాత వివిధ సంస్థ‌లు రిక్రూట్ చేసుకోవ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తాయి. ఈ అగ్నిప‌థ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ ద‌ళాల్లో స‌ర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మ‌హిళ‌లు, పురుషుల‌ను ఇద్ద‌రినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఆర్మీలో 40,000 మంది, వైమానిక దళంలో 3,000, నేవీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement