Tuesday, May 7, 2024

తాలిబ‌న్లు చంపినా దేశం వ‌దిలి వేళ్లను: మేయర్ జ‌రీఫా

ఆఫ్ఘ‌నిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అఫ్ఘాన్ నుంచి పారిపోవడానికి ప్రజలు ప్రయత్నిస్తు ప్రణాలు కోల్పోతున్నారు. తాము శాంతియుత‌మైన అంత‌ర్జాతీయ సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతున్న‌ప్ప‌టికీ వారు ఎలాంటి పాల‌న ఎలా ఉంటుందో తమకి తెలుసని అక్కడి ప్రజలు వాపోతున్నారు. మ‌హిళ‌లు, చిన్న‌పిల్ల‌ల‌కు ఆ దేశంలో ర‌క్ష‌ణ ఉండ‌దు.  12 ఏళ్లు దాటిన మ‌హిళ‌లు ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌దు.  చ‌దువు పేరుతో స్కూళ్ల‌కు వెళ్ళ‌డం నిషేదం. వ‌స్త్ర‌ధార‌ణ విష‌యంలోకూడా తాలిబ‌న్లు కౄరంగా వ్య‌వ‌హ‌రిస్తారు.  ఇక రాజకీయాల్లో మ‌హిళ‌లు ఉండ‌టం అంటే అది ఏ మాత్రం కుద‌ర‌ని ప‌ని.  ఆఫ్ఘ‌నిస్తాన్ చ‌రిత్ర‌లో మొదిటిసారి ఓ మ‌హిళ మేయ‌ర్‌గా ఎంపికైంది.  27 ఏళ్ల జ‌రీఫా గ‌ఫారీ మేదాన్ వార్దాక్ ప్రావిన్స్‌కు మేయ‌గా 2018 లో ఎంపిక‌యింది.  అప్ప‌టి నుంచి జ‌రీఫా ప్రావిన్స్ అభివృద్దికి కృషిచేస్తున్న‌ది.  గ‌త ప‌దిరోజుల వ్య‌వ‌ధిలోనే ఆఫ్ఘ‌న్ చ‌రిత్ర మొత్తం మారిపోవ‌డంతో ప్ర‌స్తుతం కాబూల్‌లోని త‌న నివాసానికే ప‌రిమితం అయింది.  ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల కౄర‌పాల‌న మొద‌లైంద‌ని, మ‌హిళ‌ల‌కు ఏ మాత్రం ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని, త‌న లాంటివారి కోసం తాలిబ‌న్లు త‌ప్ప‌కుండా వ‌స్తార‌ని, తాను భ‌య‌ప‌డి దేశం విడిచి పారిపోన‌ని, తాలిబ‌న్లు చంపినా తాను దేశం వ‌దిలి వేళ్లేది లేద‌ని తెగించి చెప్పేసింది జ‌రీఫా.

ఇది కూడా చదవండి: బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement