Sunday, May 12, 2024

న‌టి హేమ కూమారైని చూశారా

క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా హేమ తెలుగువారికి సుప‌రిచిత‌మే. కాగా ఈమె 250 పైచిలుకు సినిమాల్లో నటించింది . నిర్మోహమాటంగా మాట్లాడే మనస్థత్వం కావడంతో… వివాదాల్లో కూడా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మా ఎలక్షన్స్ సమయంలో.. ఆమె ప్రెస్ మీట్స్‌తో హొరెత్తిస్తుంది. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ జై సమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది హేమ. ప్రజంట్ ఎందుకో కానీ ఈమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. హేమ పెద్దలను ఎదిరించి.. సయ్యద్ జాన్ అహ్మద్ అనే సినిమాటోగ్రాఫర్‌ను మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇషా అనే కుమార్తె ఉంది. ఇషాకు ప్రజంట్ 22 సంవత్సరాలు. హీరోయిన్‌ అయ్యే అన్ని ఫీచర్స్ ఈషాకు ఉన్నాయి. ఆమె చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అయితే సినిమాలపై ఇంట్రస్ట్ లేకపోవడంతో.. కుమార్తెను ఇండస్ట్రీకి దూరంగా పెంచింది హేమ. ఏమో మనసు మార్చుకుని ఈషా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement