Monday, November 11, 2024

Accident – మమతా బెనర్జీకి నుదిటి పై గాయం – ఆస్పత్రికి తరలింపు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ముఖ్యమంత్రిని హుటాహుటిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఆమె నుదుటిపై గాటు పడగా, ముఖంపై రక్తం కారుతున్న దృశ్యాలను ఆ ఫొటోలో కనిపించాయి.మమత ఇంట్లో గాయపడ్డారని తెలుస్తోంది. వెంటనే కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మా చైర్‌పర్సన్ మమతా బెనర్జీకి పెద్ద గాయమైందని.. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు టీఎంసీ ఎక్స్‌లో పేర్కొంది.

మమతకు జరిగిన ప్రమాదంపై ఆయా రాజకీయ పార్టీలు వాకబు చేస్తున్నాయి. మమత ఇండియా కూటమిలో ఉన్నారు. దీంతో కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఏం జరిగిందో ఆ పార్టీ నేతలను అడిగి తెలుసుకుంటున్నారు.ఇక ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement