Saturday, April 27, 2024

బోల్డ్ కంటెంట్ తో ఆకాశ‌వీధుల్లో-ట్రైల‌ర్ లో లిప్ లాక్స్

ఈ మ‌ధ్య‌కాలంలో యూత్ ని ఆక‌ర్షించేందుకు ప‌లు చిత్రాలు బోల్డ్ కంటెంట్ తో తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్నో చిత్రాలు వ‌చ్చాయి. వాటిల్లో అర్జున్ రెడ్డి చిత్రం ముందు వ‌రుస‌లో ఉంటుంది. కాగా అలాంటి కంటెంట్ తో మ‌రో చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ చిత్ర‌మే ఆకాశ వీధుల్లో..కాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు.ఈ ట్రైల‌ర్ లో హీరో గౌతమ్ కృష్ణ చాలా బోల్డ్ గా మాస్ గా కనిపిస్తున్నారు. గౌతమ్ కృష్ణ హీరోగానే కాకుండా ఈ సినిమాకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా సెప్టెంబర్ 2న‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్కడ మందు దొరడకం లేదు అంటూ గోవా వరకు వచ్చాను అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆయన పాత్ర ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పినట్లుగా ఉంది. హీరోయిన్ గా పూజిత పొన్నాడ నటించింది. ఈ సినిమా కోసం హీరో గౌతమ్ కృష్ణ తో లిప్ లాక్ చేయడంతో పాటు చాలా బోల్డ్ గా కూడా నటించినట్లుగా ట్రైలర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement