Sunday, April 28, 2024

రికార్డు స్థాయిలో కరోనా కేసులు – 24 గంటల్లో రెండు లక్షలు

ఇండియాలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. తొలిసారి రెండు లక్షలు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,00,739 కేసులు నమోదు అయ్యాయి. అలాగే 1038 మరణాలు సంభవించాయి. ఇక తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశవ్యాప్తంగా 1. 40 కోట్లు కరోనా కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు 1,73,123 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ గా 14 71 887 కేసులు ఉండగా 1.24 కోట్లు మంది డిశ్చార్జి అయ్యారు. ఇక ఇప్పటి వరకు ఇండియాలో 11.44 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేశారు.

మరోవైపు తెలంగాణలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కొత్తగా 3307 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 8మంది మృతి చెందారు. ఇక తాజాగా నమోదైన కేసులతో 3.38 లక్షలకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. అలాగే మహమ్మారి కారణంగా 1788 మంది మృతి చెందారు. ప్రస్తుతం 27 861యాక్టీవ్ కేసులు ఉండగా 3.08 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ 446, మేడ్చల్ 314 నిజామాబాద్ 279 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement