Saturday, April 27, 2024

73శాతం పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీ, రాష్ట్రంలో అన్నిరకాల పాలిటెక్నిక్‌ సీట్లు 28, 562

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్‌ పరీక్షలో అర్హత సాధించిన 73శాతం విద్యార్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ కాలేజీల్లో కలిపి 28562 సీట్లు అందుబాటులో ఉండగా… 20709 సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 7853 సీట్లు మిగిలిపోయాయి. అడ్మిషన్ల ప్రక్రియలో భాగం గా ఈనెల 2న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు.

అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల్లో 11922 కన్వీనర్‌ కోటా సీట్లలో 10448 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 1474 సీట్లు మిగిలిపోయాయి. ఎయిడెడ్‌ కాలేజీల్లో 230 సీట్లకుగాను 197 భర్తీ కాగా 33 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 16410 సీట్లకుగాను 10064 సీట్లను భర్తీ చేయగా ఇంకా 6346 సీట్లను కేటాయించాల్సి ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement