Friday, December 6, 2024

జాతీయస్థాయి సెయిలింగ్‌ పోటీలో హైదరాబాద్‌ చిన్నారి రికార్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జాతీయస్థాయి సెయిలింగ్‌ పోటీల్లో హైదరాబాద్‌లోని రసూల్‌పురకు చెందిన బాలిక కాంస్య పతకాన్ని సాధించి సత్తాచాటింది. ధీటైన సీనియర్లను ఎదురించి మరీ లహరి కొమరవెల్లి (12) ఈ ఘనతను సాధించింది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్రం మైసూరులోని కృష్ణరాజసాగర్‌ రిజర్వాయర్‌లో జాతీయ స్థాయి సెయిలింగ్‌ పోటీలు నిర్వహించారు. గాలి పవనాల వేగం గంటకు 15-20 కి. మీ. ఉన్నప్పటికీ చిన్నారి లహరి నాలుగు రౌండ్ల రేసును విజయవంతంగా పూర్తి చేసింది. లహరి తల్లి వంట మనిషిగా పనిచేస్తుండగా… తండ్రి క్షౌర వృత్తి చేస్తున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement