Wednesday, May 8, 2024

జైలులో 53 మంది ఖైదీలకు కరోనా

కరోనా మహమ్మారి జైలులోని ఖైదీలనూ వదిలిపెట్టడం లేదు. అసోం రాష్ట్రంలోని దిబ్రూఘడ్ సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా సోకింది. దిబ్రూఘడ్ కేంద్ర కారాగారంలోని 223 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 53 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు దిబ్రూఘడ్ డిప్యూటీ కమిషనర్ పల్లవ్ గోపాల్ ఝా  చెప్పారు. జైలులోనే ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వైరస్‌ సోకిన ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా ఉందని, వీరిని మెరుగైన చికిత్స కోసం అసోం మెడికల్‌ కాలేజీకి తరలించినట్లు చెప్పారు.  కొత్తగా వచ్చిన ఖైదీ ఒకరు కరోనా పాజిటివ్ కావడంతో.. అతని ద్వారా జైలులోని 53 మందికి కరోనా సోకిందని భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం దిబ్రూగఢ్‌ జిల్లాలో 4,206 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరోవైపు నిన్న అసోంలో 6,143 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. 89 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారని ఆరోగ్యశాఖ తెలిపింది. 48,390 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పెరుగుతున్న కొవిడ్‌ కేసుల మధ్య అసోం ప్రభుత్వం లాక్‌ డౌన్‌ తరహా ఆంక్షలు విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement