Friday, April 26, 2024

ఆ అప్డేట్ కూడా ఈ రోజే బ్లాస్ట్ చేస్తారట !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఇదే విషయమై అధికారికంగా పుట్టినరోజు సందర్భంగా ప్రకటన రానుందట. ఇక ఈ కాంబినేషన్ అనౌన్స్ మెంట్ కోసం మాస్ అభిమానులు కూడా ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ రోజు ఏ సమయానికైనా ఈ అప్డేట్ ను బ్లాస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement