Saturday, April 27, 2024

స్టార్ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్ నెక్ట్స్ మూవీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరి ఆయన నెక్ట్స్ చేయబోయే చిత్రంపై ఎన్నో భారీ అంచనాలు ఉంటాయి. మెగా ఫ్యాన్స్ కి ఓ శుభవార్త వచ్చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం  తర్వాత మెగా పవర్ స్టార్  రామ్‌ చరణ్‌ చేయబోయే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా జెంటిల్‌మేన్‌, ప్రేమికుడు, ఇండియ‌న్‌, జీన్స్‌, ఒకే ఒక్క‌డు, అప‌రిచితుడు, రోబో, 2.0 వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా ప్రెస్టీజియ‌స్ మూవీగా భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా చిత్రం రూపొంద‌నుందని అధికారికంగా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement