Tuesday, May 7, 2024

మాస్కో : రష్యాలో మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ- దేశంలో తొలి కేసు

రష్యాలో బర్డ్ ఫ్లూ మనిషికి సోకినట్లు నిర్థారణ అయ్యింది. బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ వైరస్ హెచ్5ఎన్8 పక్షుల నుంచి మనిషికి సోకిందని రష్యా ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపిన నివేదికలో పేర్కొంది.  రష్యా, చైనా, మధ్యప్రాచ్య దేశాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నిర్ధారణ అయినా, ఈ వైరస్ మనిషికి సోకినట్లు నిర్ధారణ అయ్యింది మాత్రం ఒక్క రష్యాలో  మాత్రమే. ఇప్పటి వరకూ ఆయా దేశాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి పౌల్ట్రీలకు మాత్రమే పరిమితం అయ్యంది. రష్యాలో మాత్రం తొలి సారి ఇది పక్షుల నుంచి మనిషికి వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. కాగా కొద్ది రోజుల కిందటే రష్యా బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మానవుల్లో వ్యాపిస్తున్నదని కొద్ది రోజుల కిందటే అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఆ దేశంలో ఇటువంటి తొలి కేసును ఇప్పుడే నిర్ధారించినట్లు చెబుతున్నది.    

Advertisement

తాజా వార్తలు

Advertisement