Friday, April 26, 2024

మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరుగుతున్నాయ్‌..

మారుతీ సుజుకీ తమ కార్ల ధరల్ని పెంచనున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్‌ నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తామని గురువారం తెలిపింది. ధరలు ఎంత మేర పెంచనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే, నియంత్రణాపరమైన చర్యలు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ధరల్ని సవరించాల్సి వస్తోందని తెలిపింది. తయారీ వ్యయాల్ని నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నిచామని మారుతీ సుజుకీ తెలిపింది.

అయినప్పటికీ కొంత భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పడం లేదని పేర్కొంది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు మారుతుందని తెలిపింది. ఇప్పటికే హోండా కార్ప్‌, టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌లు కూడా వచ్చే నెల నుంచి ధరల్ని పెంచనున్నట్టు ప్రకటించాయి.

- Advertisement -

హోండా అమేజ్‌ ధర కూడా….

వచ్చే నెల నుంచి మారనున్న కఠినమైన ఉద్గార నిబంధనల కారణంగా ఉత్పాదక వ్యయం పెరుగుదల ప్రభావాన్ని అధిగమించేందుకు హోండా కార్ప్‌ ఇండియా తన ఎంట్రీ లెవల్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ అమేజ్‌ ధరలను రూ. 12,000 వరకు పెంచాలని యోచిస్తోంది. మోడల్‌ వివిధ ట్రిమ్‌లను బట్టి ధర పెరుగుదల మారుతూ ఉంటుందిని తెలిపింది. సెడాన్‌ సిటీ ధరలను మార్చడం లేదని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement