Thursday, April 18, 2024

నరేగా కూలీలకు చెల్లింపుల గడువు పెంచండి.. కేంద్రానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ కార్మికులకు ఆధార్‌ ఆధారిత చెల్లింపు గడువును పొడిగించవలవసినదిగా వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏబీపీఎస్) వల్ల వేతనాలు పొందడంలో ఉపాధి హామీ కార్మికులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ దృష్టికి తీసుకొచ్చారు.

ఏబీపీఎస్‌ గడువును ఆరు నెలలు పొడిగించాలంటూ శ్రీకృష్ణదేవరాయలు కేంద్రమంత్రికి లేఖ రాశారు. 31 మార్చి 2023 వరకు మంత్రిత్వ శాఖ గడువు విధించిందని, ఆ తర్వాత మాత్రమే ఏబీపీఎస్‌ ద్వారా చెల్లింపు చేస్తారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement