Sunday, May 19, 2024

బీజేపీ కూటమికి విజయ్‌కాంత్ పార్టీ గుడ్‌బై

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల కేటాయింపుల్లో విభేదాల కారణంగా అన్నాడీఎంకే, బీజేపీ కూటమి నుంచి నటుడు విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకే పార్టీ బయటకు వచ్చింది. కూటమిలో తమకు ప్రాధాన్యం లభించకపోతే మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ కొన్నిరోజులుగా చెప్తూనే వస్తోంది. కాగా తాజాగా కూటమి నుంచి డీఎండీకే పార్టీ బయటకు రావడంతో కమల్ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎండీకే తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. కాగా ఏప్రిల్ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడి అవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement