Saturday, May 11, 2024

న్యూఢిల్లీ : టూల్ కిట్ కేసులో దిశరవికి పోలీసు కస్టడీ

టూల్‌కిట్‌’ కేసులో ఈనెల 13న బెంగళూరులో అరెస్టు చేసిన పర్యావరణ కార్యకర్త దిశా రవిని ఒక రోజు పోలీసు కస్టడీకి ఢిల్లీ హైకోర్టు   అనుమతించింది. జనవరి 26న ట్రాక్టర్‌ ర్యాలీలో చోటుచేసుకున్న హింసపై పోలీసు దర్యాప్తులో భాగంగా ‘టూల్‌కిట్‌’ కేసు వెలుగుచూసింది.
దిశా రవి మూడు రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ ముగియడంతో ఆమెను పాటియాలా‌ హౌస్‌ కోర్టు చీఫ్‌ మెట్రోపాలిటలన్‌ మేజిస్టేట్ర్‌ డాక్టర్‌ పంకజ్‌ శర్మ ముందు పోలీసులు హాజరు పరిచారు. ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించాలని ఢిల్లీ పోలీసులు కోరారు. ఢిల్లీ పోలీసుల తరఫున న్యాయవాది వికాస్‌ తన వాదన వినిపిస్తూ, ఈ కేసులో నికిత, శంతను అనే మరో ఇద్దరు నిందితులు ఉన్నారని, వాళ్లు కూడా విచారణకు హాజరుకావాల్సి ఉందని చెప్పారు. ఈ ఇద్దరిని అరెస్టు చేయకుండా ముంబై హైకోర్టు ముందస్తు రక్షణ కల్పించింది. టూల్‌కిట్‌ వ్యవహారంలో ఈ ఇద్దరితో కలిపి దిశా రవిని విచారించాల్సి ఉందని కోర్టుకు  ‌ తెలిపారు. ఢిల్లీ పోలీసుల రిమాండ్‌ అప్లికేషన్‌ను దిశా రవి తరఫు న్యాయవాది సిద్దార్థ్‌ అగర్వాల్‌ వ్యతిరేకించారు.  గతంలో ఏడు రోజుల కస్టడీ అడిగి ఐదు రోజుల కస్టడీ పొందారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement