Wednesday, May 1, 2024

అమరావతి : నేడు ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ కేబినెట్‌ నేడు భేటీ కానుంది. సీఎం జగన్‌ నేతృత్వంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ ఉదయం 11 గంటలకు సమావేశం అవుతుంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు ప్రధాన ఎజెండాగా కేబినెట్‌లో చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులను కూడా మంత్రివర్గం ఆవెూదించనుంది. తిరుపతిలో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంపైనా చర్చించే అవకాశం ఉంది రాష్ట్ర విభజన హావిూలు, ఉద్యోగుల పంపకం, తదితర అంశాలపై  రాష్ట్ర ప్రభుత్వ అనుసరించాల్సిన విధానంపై కూడా కేబినెట్ లో చర్చిస్తారు.   విశాఖ ఉక్కు, కార్మికుల ఉద్యమం, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement