Saturday, April 27, 2024

‘అమితాబ్’ సినీ ప్రస్థానానికి 52ఏళ్లు

52వసంతాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. దర్శకుడు అహ్మద్ అబ్బాస్ తెరకెక్కించిన సాత్ హిదుస్తానీ ద్వారా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు అమితాబ్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి ఫిబ్రవరి 15 1969 న సైన్ చేయగా.. తొమ్మిది నెలల తరువాత నవంబర్ 7 న రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా.. ఐదు దశాబ్దాలుగా అమితాబ్ ప్రస్థానాన్ని వర్ణిస్తూ.. బిగ్ బి ఫొటోలతో ఓ అభిమాని వీడియో రూపొందించారు. ఈ వీడియోను ట్విటర్ లో పోస్టు చేశారు బచ్చన్. “నేను ఈ రోజునే చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాను. ఫిబ్రవరి 15 1969. యాభై రెండు సంవత్సరాలు గడిచిపోయాయి! అందరికీ  కృతజ్ఞతలు.” అని పేర్కొన్నారు అమితాబ్. ఇన్నేళ్లుగా అభిమానులు కురిపిస్తున్న ప్రేమ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement