Sunday, April 28, 2024

Editorial : అలవికాని వాగ్దానాలు…చేటే!

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం నాడు ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)ని న్యాయపత్ర పేరిట విడుదల చేసింది. 24పేజీల ఈ ప్రణాళికలో కాంగ్రెస్‌ తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు జేయబోయే పథకాలనూ,కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేసింది. ముఖ్యంగా, ప్రజలకు ఐదుగ్యారంటీలను ఇచ్చింది.ఈ ప్రణాళిక లో ఐదు న్యాయాలు ఉన్నాయి. యువకులు, మహిళలు, రైతు లు, శ్రామికులు,అల్పసంఖ్యాక వర్గాల కు న్యాయం చేకూ రుస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.ఈ ప్రణాళికలో కొత్త దనం ఏమీ లేదు.

కర్నాటక,తెలంగాణ అసెంబ్లి ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలనే ఇందులో పొందు ప ర్చారు. ఆ గ్యారంటీల వల్ల ఆ రెండు రాష్ట్రాలలో పార్టీకి ప్రజలు పట్టం కట్టడం వల్ల వాటిపై సెంటిమెం ట్‌తోనే ఈ ప్రణాళికలో చేర్చి ఉంటారు. మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం నేతృత్వంలో మ్యానిఫెస్టో కమిటీ దీనిని రూపొందించింది.ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపా లించిన కాంగ్రెస్‌ ఇప్పుడు సరికొత్తగా వాగ్దానాలను ఇవ్వాల్సిన అవసరం లేదు.కానీ, ఎన్నికల ముందు మ్యానిఫెస్టోని విడుదల చేయడం ఆనవాయితీ కనుక విడుదల చేశారు.ఎన్నికల ప్రణాళిక అనేది ఒక నమూనా మాత్రమే. దానిని మించి కార్యక్రమాలనూ, పథకాలను అమలు జేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రజలకు ఆ విషయంలో నమ్మకం కుదిరితే ఈ వాగ్దానాల గురించి పట్టించుకోరు.ఈ ప్రణాళికలో పేర్కొన్న వర్గాలే కాకుండా ఇంతవరకూ ఎటువంటి సాయం పొందని వర్గాలు సమాజంలో అనేకం ఉన్నాయి. ఎన్నికల ముందు విడుదల చేసే ప్రణాళికలను అధికారంలోకి వచ్చిన తర్వాత చాప చుట్టేయడం వల్లనే వాటికి విలువ తగ్గిపోతోంది.పార్టీల ప్రతిష్ట దిగజారుతోంది.తమ పార్టీ అధికారంలోకి వస్తే కులగణనను అమలు జేస్తామని ఈ ప్రణాళికలో కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది.

- Advertisement -

కులగణన అనేది మాజీ ప్రధానులైన నెహ్రూ, ఇందిరాగాంధీల సిద్దాంతాలకు వ్యతిరేకమని పార్టీ సీనియర్‌ నాయకుడు ఆనంద్‌ శర్మ ఇప్పటికే విమర్శించారు.అలాగే, రిజర్వే షన్ల పరిధిని 50 శాతం మించి పొడిగిస్తామంటూ కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది.ఇది అమలు చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే,రిజర్వేషన్ల పరిమితిని పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరం.రాజ్యాంగ స వరణ చేయాలంటే కాంగ్రెస్‌కి పార్లమెంటులో మూడిం ట రెండు వంతుల మెజారిటీ రావాలి. ప్రస్తుత పరిస్థితిలో అంత పెద్ద మెజారిటీ ఆ పార్టీకి వచ్చే అవకాశం లేదు.ఆ పార్టీ పోటీ చేస్తున్నదే నాలుగువందల సీట్ల లోపు.ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ కూడా నాలుగువందల స్థానాలను లక్ష్యంగా పెట్టుకుంది కానీ, అన్ని సీట్లు ఆ పార్టీకి వచ్చే అవకాశం లేదు.దేశంలో ప్రాం తీయ పార్టీల జోరు పెరిగింది.అందువల్ల కాంగ్రెస్‌,బీజేపీలలో ఏది అధికారంలో వచ్చినా, ప్రాంతీయ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే. కానీ, ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అంత పెద్ద మెజారిటీ జాతీయ పార్టీలతో ఏర్పాటయ్యే సంకీర్ణ కూటములకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ మ్యాని ఫెస్టోలో ముఖ్యమైనది అప్రెంటిస్‌షిప్‌కి సంవత్సరానికి లక్షరూపాయిల స్టయిఫండ్‌ ఇస్తామన్నది. ఇది కూడా అలవి కాని వాగ్దానమే. డిప్లొమాలు పొందిన సాంకేతిక విద్యా పట్టభద్రులకు పరిశ్రమల్లో అప్రెంటిస్‌షిప్‌లు దొర కడం కష్టంగా ఉంది.

ప్రభుత్వం నుంచి భూములు,చౌక రేట్లకు విద్యుత్‌,నీరు వంటి మౌలిక సదుపాయాలను పొందుతున్న పారిశ్రామికవేత్తలు అప్రెంటిస్‌షిప్‌లకు ఈ డిప్లొమా హోల్డర్లను తీసుకోవడం లేదు.రాజకీయంగా పలుకుబడి కలిగిన వారి సిఫార్సులుంటేనే అప్రెంటిస్‌ షిప్‌ లభిస్తోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వ హయాంలో కూడా ప్రైవేటు పరిశ్రమల్లో ఉద్యోగార్థులకు అప్రెంటిస్‌షిప్‌లు లభించలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కూడాఇదే పరిస్థితి. మార్చి 31 వరకూ లక్ష రూపాయిల విద్యా రుణాన్ని మాఫి చేస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది.రుణాల మాఫీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవ డానికే ఉపయోగపడుతోంది.రైతులకు రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్‌,బీజేపీ వంటి జాతీయ పార్టీలే కాకుండా,ప్రాంతీయ పార్టీలు సైతం ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయి.
రుణమాఫీ విషయంలో యూపీఏ తొలివిడత ప్రభు త్వం అమలు జేసిందికానీ, మిత్ర పక్షాలు సహకరిం చకపోవడం వల్ల దానిపై కూడా విమర్శలు వచ్చాయి. అందువల్ల వాగ్దానాల అమలు అంత సులభం కాదు. ఒక్క కాంగ్రెస్‌ మాత్రమే కాదు, దానిని గద్దె దించి అధికా రంలోకి వచ్చిన బీజేపీ కూడా వాగ్దానాల అమలు విష యంలో చతికిల పడుతోంది. ఉచితాలను సుప్రీంకోర్టు ,ప్రపంచ బ్యాంకు వం టి సం స్థలు వ్యతిరేకిస్తున్న దృష్ట్యా అమలు జేయగల వాగ్దా నాలను మాత్రమే చేయ డం అందరికీ శ్రేయస్కరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement