Monday, April 29, 2024

నేటి సంపాదకీయం-చారిత్రాత్మకం!

సాగుచట్టాల రద్దు కోసం 15 మాసాలుగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులు శనివారంనాడు ఢిల్లిd సరిహద్దుల్లో తమ శిబిరాలను ఎత్తివేయనున్నట్టు ప్రకటిం చడం శుభదాయకం. రైతులు సంఘటితమై తమ కోర్కెలను సాధించుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజున విజయ్‌ దివస్‌ని నిర్వహించను న్నట్టు సంయుక్త కిసాన్‌ మోర్ఛా ప్రకటించింది.అయితే, సమస్యను సమస్యగానే చూడాలి. ఒకరిది విజయం,మరొకరిది పరాజయం అన్న ధోరణిలో ఎవరు వ్యవరించినా కథ మళ్ళీ మొదటికి వస్తుంది. సాగు నీటిచట్టాల రద్దుకు సంబంధించిన బిల్లులను పార్లమెంటు ఆమోదించిన తర్వాత కూడామిగిలిన డిమాండ్ల కోసం రైతులు ఆందోళన సాగించారు. దాంతో విమర్శలు వచ్చాయి. వాటిని కూడా ఆమోదించేందుకు ప్రభుత్వం అంగీకరించ డంతో ఇక సాగదీయడం సమజంసం కాదని కిసాన్‌ మోర్ఛా గురువారంనాడు సమావే శమై శనివారం నుంచి ఆందోళనను పూర్తిగా విరమిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ ఆందోళన సందర్భంగా మరణించిన 700మంది పైగా రైతుల కుటుంబాలకు పరిహారాన్ని ఇవ్వాలని కిసాన్‌ మోర్ఛ పట్టుపట్టింది. అయితే, మరణించిన రైతుల వివరాలు తమ వద్ద లేవని ప్రభుత్వం ప్రకటించి అపహాస్యం పాలైంది. ప్రభుత్వం మరింత దిగివచ్చి మిగిలిన డిమాండ్లను కూడా ఆమోదిస్తున్నట్టు ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన కిసాన్‌ మోర్ఛా తమ ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేయాలని జనవరి 15వ తేదీన మళ్ళీ సమావేశమై, ప్రభుత్వంఈ ప్రతిపాదనలను ఏ మేరకు ఆమోదించిందీ సమీక్షించిన తర్వాత భవిష్యత్‌ కార్యక్రమాన్ని ప్రకటించాలని నిర్ణయించింది. ఢిల్లిd సరిహద్దుల్లో సింఘు వద్ద రైతులు గుడారాలు వేసుకుని నిరవధికంగా సాగించిన ఆందోళన ప్రజాస్వామ్య చరిత్ర లో చిరస్థాయిగా నిలిచి పోతుందనడంలో సందేహం లేదు. ఎండనక, వాననక రైతులు ఆ శిబిరాలో తలదాచుకుంటూ,ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమాన్ని సాగించ డం వల్ల రైతుల పట్ల సానుభూతి పెరిగింది.

ఈ ఆందోళనను పంజాబ్‌కి చెందిన కొద్ది మంది రైతులు మాత్రమే చేస్తున్నారంటూ ప్రభుత్వంమొదట్లో అసలు పట్టించుకోలేదు.తమ ఆందోళన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టింది కాదనీ, తమ వెనుక ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆరోపిస్తున్నట్టు ఏ విదేశీ శక్తులు లేవని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్‌ తికాయత్‌ పలు సార్లు స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వం దిగిరాలేదు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు రైతులు విదేశీ ఒత్తిళ్ళకు లొంగి ఆందోళన సాగిస్తున్నా రంటూ పలువురు మంత్రులు ఆరోపించిన సంగతి తెలిసిందే. కొందరు మంత్రులు ప్రకటనలు రైతులను రెచ్చగొట్టాయి. రైతులను చులకన చేసి మరి కొందరు మాట్లాడారు. రానున్న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ ఆందోళన సాగిస్తున్నా రంటూ కొందరు మంత్రులు ప్రకటనలు చేశారు.పార్లమెంటులో మంత్రులు చేసిన ప్రకటన లు రైతుల్లో మరింత పట్టుదలను పెంచాయి. ఎంత మంది బలి అయినా సరే ఈ ఆందోళన కొనసాగించి తీరాలన్న భీషణ ప్రతిజ్ఞతో రైతులు అక్కడ తిష్ఠ వేశారు. రైతులు పంటలకు మద్దతు ధర గురించి చట్టాన్ని చేయాలని కోరుతున్నారు.

దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. పంజాబ్‌ ప్రభుత్వం కూడా మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.. ఉద్యమం సందర్భంగా రైతులపై మోపిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని కూడా కేంద్రం హామీ ఇచ్చింది. మొత్తం మీద రైతుల ఆందోళనపై ప్రభుత్వం సానుకూలం గా స్పందించడం ముమ్మాటికీ సంయుక్త కిసాన్‌ మోర్ఛాఘనవిజయమే. విద్యుత్‌ రంగం లో సంస్కరణలకు సంబంధించిన బిల్లుపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే పార్లమెంటుకు సమర్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాగు చట్టాలు రద్దు చేసినప్పటికీ మరో మార్గం ద్వారా వీటిని తమ పై ప్రభుత్వంరుద్ద వచ్చని రైతులు అనుమా నిస్తున్నారు. ఆ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement