Tuesday, May 14, 2024

బానిసత్వ చిహ్నం తెరమరుగు

సెంట్రల్‌ విస్టా… అంటే కొత్త పార్లమెంటు భవనం. దేశ రాజధాని కొత్త ఢిల్లిలో ఇంతకాలం మనం పిలుచుకుం టున్న రాజ్‌పథ్‌ని అభివృద్ధిపర్చి దానికి కర్తవ్యపథ్‌ అని పేరు పెట్టారు. ఈ కర్తవ్యపథ్‌నీ, సెంట్రల్‌ విస్టానీ గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. స్వాతంత్య్రవజ్రోత్సవాలనూ, అమృతోత్సవాలను కొద్ది రోజుల క్రితం జరుపుకున్నాం. ఈ ఉత్సవాల నాటికే సెంట్రల్‌ విస్టా పనుల్లో చాలా వరకూ పూర్తి అయ్యాయి. అయితే, రాజ్‌పథ్‌ నిర్మాణం పనుల్లో కొద్దిగా జాప్యం జరగడం వల్ల కర్తవ్యపథ్‌ ప్రారంభ కార్యక్రమం గురువారం జరిగింది. వలస పాలకుల నాటి భవనాలు, రహదారులకు స్వాతంత్య్రోద్యindia మ స్ఫూర్తిని కలిగించే రీతిలో పేర్లు పెట్టడం తప్పేమీ కాదు, అవసరం కూడా. వలస పాలకుల కాలం నాటి చట్టాల్లో 1400 వరకూ ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే రద్దు చేశారు. అలాగే, భవనాలు, కట్టడాలకు కొత్త వైభవం సంతరించే రీతిలో వాటిని కన్నుల పండువగా తీర్చిదిద్దారు. భాద్ర పద శుద్ధ త్రయోదశి నాడు చంద్రోదయం తర్వాత కొత్త కాంతులీనే రీతిలో కర్తవ్యపథ్‌ ప్రారంభోత్సవ కార్యక్ర మాన్ని టెలివిజన్‌ చానల్స్‌లో దేశంలోని భారతీయులే కాకుండా, విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం టెలి విజన్‌ చానల్స్‌ ద్వారా వీక్షించి అమందానంద భరితులయ్యారు. రాజ్‌పథ్‌కి కర్తవ్యపథ్‌ అని పేరు పెట్టడంలో ఎంతో ఔచిత్యం ఉంది. రాజులెవరున్నారు ఇప్పుడు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత ప్రజావేదిక పార్లమెంటు భవనాలను త్రికోణ ఆకారంలో సెంట్రల్‌ విస్టాగా నిర్మించారు. వలస పాలనలోని అవశేషాలు, కట్టడాలను తొలగింపులో మోడీ ప్రభుత్వం దేశంలో పలు ప్రాంతాల్లోని కట్టడాలు, భవనాల పేర్లను మారుస్తోంది.

అలాగే, పార్లమెంటు భవనానికి సెంట్రల్‌ విస్టాగా పేరు పెట్టారు. కర్తవ్య పథ్‌ రహదారిని అందంగా తీర్చి దిద్దారు. ఈ రహదారికి ఇరువైపులా అందమైనలాన్స్‌, వంతెనలు ఉన్నాయి. ప్రారంభంలో నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం ఎత్తు 28 అడుగులు. దీనిని ఖమ్మం జిల్లా నుంచి తెప్పించిన గ్రానైట్‌ ఏకశిలతో నిర్మించారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నేతాజీ విగ్రహంపైకి పూలు జల్లి నివాళు లర్పించారు. నేతాజీకి ప్రధాని నివాళులర్పించిన సమయంలో ఐఎన్‌ఏ యోధులు, నేతాజీ అభిమానులు నేతా జీని సంస్మరించే అవకాశం కల్పించినందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు కోసం పనిచేసినవారిని శ్రమజీవులుగా ప్రధాని అభివర్ణించా రు. పార్లమెంటు ప్రస్తుతం ఉన్న భవనం బ్రిటిష్‌ పాలకుల కాలం నాటిది. వలస పాలనకు చిహ్నంగా ఉన్న ఆభవనానికి బదులు ఈ కొత్త భవనాన్ని నిర్మించారు. ఈ సముదాయంలో ఉపరాష్ట్రపతి భవనం, కేంద్ర సచివాలయం ప్రధాన శాఖల కార్యాలయాలు నెెలకొని ఉంటాుం. సెంట్రల్‌ విస్టా భారత దేశంలోని రాష్ట్రాల సంస్కృతీ సంప్ర దాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. దీనినినిర్మించాలన్న ఆలోచన ప్రధానికి రెండేళ్ళ క్రితం వచ్చింది. రాజ్‌పథ్‌, కింగ్స్‌ వే అనే పేర్లు వలస పాలనను గుర్తుచేసే పేర్లు, స్వతంత్ర భారత దేశంలో ఇంకా వలస పాలన నాటి పేర్లను కొనసాగించడంలో ఏమాత్రం సమంజసం కాదన్న అభిప్రాయానికి చాలా మంది మద్దతు పలికారు.

అయితే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ కోణంలోదీనిని ఆలోచించి విమర్శలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు కూడా గుప్పించాయి. అయితే, చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా సెంట్రల్‌ విస్టా భవనాల నిర్మాణం జరిగేట్టు ప్రధాని దృఢ సంకల్పంతో పూనుకుని పూర్తి చేశారు. నేతాజీ విగ్రహం కర్తవ్య పథ్‌లో ప్రతిష్టిం చుకోవడం ఆయనపట్ల దేశ ప్రజల గౌరవానికీ, ఆరాధనా భావానికి నిదర్శనం. నేతాజీ త్యాగాన్ని ఈ దేశంఎన్నటికీ మరువదు అని చాటడమే ఈ విగ్రహ ప్రతిష్ఠాపనలోని పరమార్థం. నేతాజీ చూపిన మార్గంలో పయనిస్తే అతి స్వల్ప కాలంలోనే దేశం అత్యున్నత స్థాయికి ఎగబాకుతుందన్న ప్రధానమంత్రి మాటల్లో అత్యుక్తి లేదు. అసలు ఈ దేశం స్వరూపమే ఇలా ఉండేది కాదు. నేతాజీ విగ్రహావిష్కరణకు తనకు సరైన రీతిలో ఆహ్వానం అందలేదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణ మూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సంద ర్భాల్లో ప్రోటోకాల్స్‌ గురించి యాగీ చేయడం సమంజసం కాదు. ఇది పార్టీ కార్యక్రమం కాదు. ప్రజా కార్యక్రమం కనుక, దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అన్న సామెతను వర్తింపజేసుకుని ఆమె కూడా నేతాజీ విగ్రహం ప్రారంభోత్సవానికి హాజరై ఉంటే బాగుండేది. పార్లమెంటు ముందున్న గాంధీజీ విగ్రహం వద్ద ప్రతిపక్షాలకు ఆగ్ర హం కలిగినప్పుడల్లా ధర్నాలూ, బైఠాయింపులు చేస్తున్న ప్రజాప్రతినిధులు ఇకపై నేతాజీ విగ్రహం వద్ద కూడా చేస్తారేమో.

Advertisement

తాజా వార్తలు

Advertisement