Sunday, April 28, 2024

EDITORIAL: ఆ తీర్పు… ఒక పాఠం..!

గుజరాత్‌ అల్లర్ల కేసుల్లో ఒకటైన బిల్కీస్‌ బానో పై అత్యాచారం కేసులో నిందితులకు గుజరాత్‌ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసు విచారణ జరిపిన మహారాష్ట్ర కోర్టు అధికారాన్ని గుజరాత్‌ ప్రభుత్వం హైజాక్‌ చేసిందని జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున నిందితులకు క్షమాభిక్షను ప్రసాదించే అధికారం గుజ రాత్‌ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. 2002 గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో వరుసగా అల్ల ర్లు జరిగాయి. వాటిలో భాగంగా ఈ అత్యాచారం దుర్ఘట న చోటుచేసుకుంది. బిల్కీస్‌ బానో కుటుంబానికి చెం దిన ఏడుగురిని నిందితులు హత్య చేశారు. ఐదు నెలల గర్బిణిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ కేసుపై విచారణ జరిపిన సీబీ ఐ కోర్టు 11మంది నిందితులకు యావజ్జీవ ఖైదు శిక్షను విధించింది. బొంబాయి హైకోర్టు ఈ శిక్షను ధ్రువీక రించింది. దోషులు 15 ఏళ్ళ పాటు జైలులో ఉన్నారు. తనను విడుదల చేయా లని కోరుతూ వీరిలో ఒకరు కోర్టును ఆశ్రయించారు.

అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై గుజరాత్‌ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అర్జీ పెట్టుకున్న నింది తునికే కాకుండా మొత్తం 11 మందికి రెమిషన్‌ మంజూ రు చేయాలని ఆ కమిటీ రాష్ట్ర ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ఈ కేసులో ముద్దాయిలంతా 2002 ఆగస్టు 15 వ తేదీన విడుదల అయ్యారు. వీరం దరికీ వీరోచిత స్వాగతం లభించింది. గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నిందితుల్లో ఒకరైన రాథేశ్యామ్‌ షా న్యాయవాదిగా తిరిగి ప్రాక్టీసు ప్రారంభించారు. ఈ పదకొండు మందిని గుజ రాత్‌ ప్రభుత్వం విడుదల చేయడాన్ని బిల్కీస్‌ బానో సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. ఆమె దరఖాస్తును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడమే కాకుండా, ఆమె పేర్కొన్న అంశాలను సమర్థించింది.

- Advertisement -

కాగా, ఈ నిందితులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు గుజరాత్‌ ప్రభు త్వాన్ని ఆదేశించలేదు. వారి అభ్యర్థనలో మంచి చెడ్డలను పరి శీలించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, గుజరాత్‌ ప్రభుత్వం నిందితులను విడుదల చేయడం కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను వక్రీకరించింది. నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టు ఆదేశించకపోయినా, గుజ రాత్‌ ప్రభుత్వం ఈ కేసులో తీసుకున్న చొరవను నేరపూ రితమైన చర్యగా సుప్రీంకోర్టు అభివర్ణిం చింది. నిందితు లను విడుదల చేసే ముందు గుజరాత్‌ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసి ఉండాల్సిందనీ, కానీ, అలా చేయలే దని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక మహిళ హక్కును కాలరాసి ఆమె మూడేళ్ళ కుమార్తె ఎదుటే ఆమెపై నింది తులు అత్యాచారం చేశారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు విచారణ జరి గింది మహారాష్ట్రలో కనుక, దోషులను విడిచి పెట్టే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ గుజరాత్‌లో జరగాల్సి ఉండగా, సాక్షులకు బెదిరింపులు రావడంతో మహారా ష్ట్రకు బదిలీ చేశారు. కాగా,ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అనీ, అందుకే, ఈ కేసులోముద్దాయిలకు గుజ రాత్‌లోని బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించిందని అందుకోసం సుప్రీంకోర్టు ఆదేశాలను వక్రీక రించిందని ఆయన అన్నారు.

గుజరాత్‌ అల్లర్లు మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగాయనీ, అప్పట్లో జరిగిన కేసులను మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా కొట్టివేయిస్తూ వస్తున్నారనీ, అయి తే, ఈ కేసులో బిల్కీ బానోస్‌ అవిశ్రాంతంగా న్యాయ పోరాటం చేయడం వల్ల నిందితులకు గుజరాత్‌ ప్రభు త్వం ప్రసా దించిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు కొట్టి వేసిందని ఆయన అన్నారు. బిల్కీస్‌ బానో జరిపిన సుదీర్ఘ న్యాయపో రాటానికి ఇది విజయమని రాహుల్‌ సోదరి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అభివర్ణించారు. బిల్కీస్‌ బానో తరఫున హక్కుల ఉద్యమ నాయకురాలు తీస్తా సెతల్వాడ్‌ కూడా పోరాడారు. ఆమెను తప్పుడు కేసులో ఇరికించి ప్రభుత్వం వేధించింది.ఈ కేసులో నిందితులు బీజేపీ నాయకులే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని అవకాశాలను వినియోగించుకుని నిందితులకు క్షమాభిక్ష లభిం చేట్టు చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఈ కేసులో నిందితులంతా రెండువారాల్లోగా మళ్ళీ జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక సామాన్య మహిళ జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటానికి ఇది విజ యమనీ, ఇది ప్రజాస్వామిక విజయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement