Sunday, April 28, 2024

Polavaram project: పోలవరం…పొరుగు భయం

నిధుల విడుదల, డిజైన్ల ఆమోదంలో నెలకొన్న తీవ్రమైన ఆలస్యం పోలవరం ప్రాజెక్టు పనుల వేగానికి ఆటంకంగా మారగా ప్రాజెక్టు పురోగతికి అంతర్‌ రాష్ట్ర సమస్యలు కూడా ఆటంకంగా మారుతున్నా యి. పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాల్లోని దిగవన ఉన్న అటవీ నివాస గ్రామాలు ముంపునకు గురవుతాయని ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ముంపుపై ఆయా రాష్ట్రాలకున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా కార్యాచరణ మాత్రం నత్తనడకన కొనసాగు తోంది. పోలవరం లో గోదావరి వరద ఉధృతి పెరిగితే శబరి, సీలేరు నదీ పరీవాహక ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు ముంపు ఉంటుం దని ఆయా రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా యి. ఈ మేరకు కేంద్ర జలశక్తికి రెండు రాష్ట్రాలు రాతపూర్వక అభ్యంతరాలు పంపించాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉన్నా ఇంతవరకు పరిష్కారం లభించలేదు. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏర్పడే సాధారణ ముంపును నివారిం చేందుకు శబరి, సీలేరు నదులకు కరకట్టలు నిర్మించాల్సి ఉండగా ఆ పనులు చేసేందుకు రెండు రాష్ట్రాలు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -


కరకట్టల నిర్మాణానికి వీలుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను వేరే చోటకు తరలించేందుకు తక్షణం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవటం లేదు. ప్రజాభిప్రాయ సేకరణకు అంగీకరిస్తున్నట్టు- ప్రకటిస్తూనే ఆచరణలో అమలుకు మాత్రం పూనుకోవటం లేదు. ఫలితం గా పోలవరం పురోగతికి ఇది ఆటంకంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వరద ఉధృతి అదుపు తప్పితే బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల కరకట్ట నిర్మాణం వల్ల తరలించాల్సిన అవసరం ఉన్న గ్రామాలతో పాటు- అదనంగా అనేక ప్రాంతాలు నీట మునుగుతాయనీ, వేలాది మంది నిరాశ్రయులవుతారనీ, ప్రాజెక్టు డిజైన్‌ మార్చటం ఒక్కటే దీనికి ఏ-కై-క పరిష్కార మార్గమని రెండు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీనిపై గోదావరిలో వరద ఉధృతి అంచనాలను లెక్కకట్టి ముంపు తీవ్రతను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం జాయింట్‌ కమిటీ-ని కూడా నియమించింది. ఈ కమిటీ-లో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ జలవనరుల శాఖ అధికారులతో పాటు- సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సిడబ్ల్యుసి), పోలవరం ప్రాజెక్టు అధారిటీ-కి చెందిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ- కూడా ఒడిశా, ఛచత్తీస్‌గఢ్‌ ముంపు అనుమానాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేయలేకపోతోంది. ప్రజాభిప్రాయానికి రెండు రాష్ట్రాలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవటంతో శబరి, సీలేరు కరకట్టల నిర్మాణం ఎలా చేపట్టాలన్న దానిపై ఉన్నతస్థాయిలో చర్చ కొనసాగుతుంది.
ఏపీ ప్రభుత్వం హామీ..
సీలేరు, శబరి నదుల ద్వారా ముంపు సమస్య ఏర్పడకుండా ఒడిశాలో రూ.378.696 కోట్లతో 30.2 కిలో మీటర్లు, చత్తీస్‌గఢ్‌లో రూ.332.3 కోట్లతో 29.12 కిలోమీటర్ల కరకట్టల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కరకట్టల నిర్మాణం కోసం ఆయా ప్రభుత్వాలు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేసేంతవరకు పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయకుండా జాగ్రత్తలు వహించేలా పోలవరం ప్రాజెక్టు అధారిటీ- (పీపీఏ) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా ప్రాజెక్టులో నీటి నిల్వకు అవకాశం లేకుండా చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు స్టాప్‌ వర్క్‌ ఆర్డర్లు ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్లను ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు వెనక్కి తీసుకున్నప్పటికీ కరకట్టల నిర్మాణానికి అవసరమైన ముంపు గ్రామాల తరలింపు ప్రక్రియనూ, అందుకు అవసరమైన ప్రజాభిప్రాయసేకరణ ప్రక్రియను ముందుకు సాగనీయటం లేదు. ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు గోదావరిలో 58 లక్షల క్యూసెక్కుల ఆధారంగా ముంపు భయాన్ని ప్రకటిస్తున్నాయి. నిజానికి 58 లక్షల క్యూసెక్కుల వరద 500 ఏళ్లకు ఒక సారి రావచ్చనీ..అది కూడా నిర్దిష్టంగా వెల్లడించలేమని దీనిపై అధ్యయనం చేసిన ఐఐటి-రూర్కే నివేదిక వెల్లడించింది.
కేంద్ర జలశక్తి కూడా పోలవరం ప్రాజెక్టు డిపిఆర్‌-1ను ఆమోదించే సందర్భంలో గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల స్థాయి వరద వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వల్ల ఏర్పడే ప్రభావాన్నే పరిగణనలోకి తీసుకుంది. ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు మాత్రం 50 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలేలా పోలవరం స్పిల్‌ వే నిర్మించారనీ.. దీని వల్ల వరద నీటి మట్టం గరిష్ట స్థాయిని కూడా దాటినప్పుడు సీలేరు, శబరిలు ఉప్పొంగితే ఒడిసాలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతాయన్న వాదనకే కట్టు-బడి ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తామనీ, దీని వల్ల బ్యాక్‌ వాటర్‌ సమస్యే ఉత్పన్నం కాదని ఏపీ వాదిస్తోంది.ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వం పీపీఏ, సిడబ్ల్యుసీ, జలవనరుల శాఖ ఉన్నతాధికారుతో నియమించిన జాయింట్‌ కమిటీ- వీలైనంత తొందరగా అంతర్‌ రాష్ట్ర వివాదాలను పరిష్కరించటం వల్ల పోలవరం ప్రాజెక్టు సాంకేతిక అవరోధాలను తొలగించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement