Sunday, April 28, 2024

గోర్బచేవ్‌… ఒక గ్లాస్‌నోస్త్‌!

సోవియట్‌ యూనియన్‌ చిట్టచివరి అధ్యక్షుడు మిఖాయిల్‌ గోర్బచేవ్‌ ప్రపంచ శాంతికి కృషి చేసి నోబెల్‌ బహుమతిని అందుకున్న కమ్యూనిస్టు నేత. ఆయన అస్తమయంతో ఒక శకం ముగిసింది. ఆయన హయాం లో సోవియట్‌ యూనియన్‌ ముక్కచెక్కలైందన్న అపవాదు వచ్చినా, ప్రచ్ఛన్నయుద్ధాన్ని ముగింప జేయ డంలో ఆయన చొరవ, పాత్ర అభినందనీయం. పాలన లో పారదర్శకత ఉండాలని పట్టుపట్టిన నాయకుడు. ఆయన హయాంలో గ్లాస్‌నోస్త్‌, పెరిస్త్రోయికా అనే పదా లు తరచుగా వినిపించేవి. ఈ రెండూ రష్యన్‌ పదాలే. గ్లాస్‌నోస్త్‌ అంటే పారదర్శకత, పెరిస్త్రోయికా అంటే పునర్నిర్మాణం. అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల మధ్య ఉద్రిక్తతల వల్ల ప్రపంచ దేశాలు నలిగి పోయేవి. ప్రపంచశాంతికి విఘాతం కలిగేది. ఆయుధ పోటీ వల్ల సోవియట్‌ యూనియన్‌ ఆర్థిక వ్య వస్థ బాగా దెబ్బతింది. మార్పు వస్తే తప్ప దేశ ఆర్థిక వ్య వస్థను బాగు చేయలేమని గోర్బచేవ్‌ గ్రహించారు. అందుకు తగిన చర్యలు చేపట్టారు. మార్పుకోసం జరిగే కృషికి వ్యతిరేకత రావడం సహజం. ఆయన ఎన్నో ప్రతిఘటనలను ఎదుర్కొన్నారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) బాగా పడిపోయింది. నైతిక విలువలు దెబ్బ తిన్నాయి. ఈ పరిస్థితులు కొనసాగితే పరిస్థితి మరింత ప్రమాదక రంగా పరిణమిస్తుందని గ్రహించిన ఆయన సంస్కరణలను ప్రవేశపెట్టారు. మార్కెట్‌ శక్తులను ఆర్థిక వ్యవస్థలోకి అనుమతించడం ద్వారా పరిస్థితిలో మార్పు తీసుకుని రావచ్చని గ్రహించారు. ఆయన ప్రయత్నాలకు అప్పట్లో కొంత వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన అధి కారంలోకి రాకముందు దేశ బడ్జెట్‌ను చూసేందుకు ఎవ రినీ అనుమతించేవారు కాదు. ఆఖరికి అత్యున్నత విధా న నిర్ణాయక వేదిక అయిన పోలిట్‌ బ్యూరో సభ్యులకు కూడా అనుమతి ఉండేది కాదు. గోర్బచేవ్‌ దేశాధినేత అ యిన తర్వాత తొలిసారిగా బడ్జెట్‌ వివరాలను వెల్లడిం చడం ప్రారంభమైంది. దేశానికి వచ్చే ఆదాయాన్ని పన్నెండు రెట్లు ఎక్కువగా చెప్పేవారు. ఆ పద్ధతిని గోర్బ చేవ్‌ సమూలంగా మార్చేశారు. గోర్బచేవ్‌ సంస్కరణల వల్ల వివిధ జాతులవారు సోవియట్‌ యూనియన్‌ నుంచి విడిపోయేందుకు ఆందోళనలు ప్రారంభించారు. ఆ విధంగా బాల్టిక్‌ దేశాలైన లిథువేనియా,లాత్వియా, ఎస్తోనియాలు విడిపోవడంతో సోవియట్‌ యూనియన్‌ పతనం ప్రారంభమైంది. ప్రచ్ఛన్నయుద్ధం వల్ల ఆర్థి కపరమైన భారం పెరగడం తప్ప సోవియట్‌ యూ నియన్‌కి కలిసొచ్చిందేమీ లేదని గ్రహించడం వల్ల ఆనా టి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌తో చర్చలు జరిపి ఆయుధ సంపత్తిని సోవియట్‌ యూనియన్‌ తగ్గిం చుకుంది. అంతేకాకుండా ఏళ్ళ తరబడి యుద్ధం సాగు తున్న అఎn్గాన్‌ నుంచి రష్యా తన సేనలను ఉపసం హరించుకుంది. ఈ రెండు చర్యలతో గోర్బచేవ్‌ పశ్చిమ దేశాలకు దగ్గరయ్యారు. నోబెల్‌ శాంతి బహుమతి లభిం చింది. అయితే,అదే సమయంలో ఆయనపై తిరుగు బాటు కూడా జరిగింది. ఇప్పుడు ఆయన మరణించిన నేపథ్యంలో పశ్చిమ దేశాలకు చెందిన నాయకుల నుండి సంతాపాలు వెల్లువలా వెలువడగా, రష్యా మాత్రం మొక్కుబడిగా సంతాప ప్రకటనను జారీ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్‌ పుతిన్‌ నియంతృత్వ విధానాలపై ఆయన పలుసార్లు గళమెత్తారు. పుతిన్‌ చుట్టూ దొంగలు ఉన్నారంటూ తీవ్రంగా విమర్శించారు. అయితే, క్రిమి యాను రష్యా ఆక్రమించుకున్న తర్వాత నిర్వహించిన రిఫరెండంను గోర్బచెెవ్‌ సమర్థించి తప్పును సరి దిద్దు కుంటున్నట్టు ప్రకటించారు. సోషలిస్టు వ్యవస్థ కోసం ఆనాడు మన దేశంలో కూడా కవులు, కళాకారులు నిన దించేవారు. మహాకవి శ్రీశ్రీ తెలుగులో గర్జించు రష్యా పేరిట రాసిన గీతాలు ఎందరికో ప్రేరణను ఇచ్చాయి. సోవియట్‌ యూనియన్‌ మాదిరిగా సోషలిస్టు వ్యవస్థను ఎన్నో దేశాలు ప్రవేశపెట్టాయి. మన దేశంలో కూడా సోషలిస్టు పదాన్ని రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. అదే మాదిరిగా గోర్బచెెవ్‌ ప్రవేశపెట్టిన పెరిస్త్రోయికా పేరిట ప్రవేశపెట్టిన సంస్కరణలు ఇతర దేశాలకు ఆదర్శప్రాయమైనాయి. చైనాలోకూడా ఆర్థిక సంస్కరణలున దాదాపు అప్పుడే ప్రారంభమైనాయి. 1991లో మన దేశంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలకు ప్రేరణ కూడా అని చెప్పవచ్చు. ఆయన దేశాధినేతగా ఉన్నప్పుడు పెరిస్త్రోయికా..న్యూ థింకింగ్‌ ఇన్‌ అవర్‌ కంట్రీ అనే పుస్తకంలో తన ఆలోచనల్లో మార్పునకు కారణాలను వివరించారు. గోర్బచేవ్‌ కడు పేదరికం నుంచి అంచెలంచెలుగా దేశాధినేతగా ఎదిగారు, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన కూడా కొంత కాలం సమష్టి వ్యవసాయ భూముల్లో పని చేశారు. ఎంత ఎత్తు ఎదిగినా నిగర్వంగానే ఉండేవారు. పాలనలో పారదర్శ కతను ప్రవేశపెట్టిన ఘనత ప్రపంచ దేశాధినేతల్లో ఆయనకే దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement