Monday, April 29, 2024

ఎడిటోరియ‌ల్ – తీర్పుల‌న్నింటిలో సుప్రీం..

కేశవానంద భారతి… న్యాయస్థానాల్లో ఆస్తుల కేసుల విచారణ సందర్భంగా ఈ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. కేరళలో ఒక మఠానికి అధిపతి అయిన కేశవా నంద భారతిని రాజ్యాంగ రక్షకునిగా అభివర్ణిస్తుంటారు. నిజానికి ఆయనకు అంత పేరు రావడానికి కారణం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని అత్యున్నత న్యాయ స్థానంలో కేసు వేయడమే. ఈ కేసు పూర్వాపరాల గురించి న్యాయ మూర్తులు తమ తీర్పుల్లో ఉదహరిస్తుంటారు. రాజ్యాం గంలోని 24, 25 అధికరణాలను మార్చే అధికారం పార్లమెంటుకు లేదని ఆయన సుప్రీంకోర్టులో కేసు వేయడమే కాకుండా, సమర్ధవంతంగా వాదించి గెలి చారు. ఆయన మూలంగా ఆస్తుల స్వాధీనం విషయం లో ప్రభుత్వాలు దూకుడుగా వెళ్ళకుండా అడ్డుకట్ట పడిం ది. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఐదు దశాబ్దాలు అయింది. ఆయన కేరళలో కాసరగోడ్‌ జిల్లా ఎడ్‌నీర్‌ మఠానికి అధిపతి. ఆయన మఠానికి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిలో 300 ఎకరాలను 1973లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలులో చేర్చి న 29వ అధికరణాన్ని సవాల్‌ చేస్తూ స్వామిజీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 25వ అధికరణం కింద మత, ధార్మిక సంస్థలకు ఇచ్చిన భూములను భూ సంస్కరణల పేరిట రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందని స్వామీజీ తరఫు న్యాయవాది వాదించారు. ఇది రాజ్యాం గంలోని మౌలిక స్వరూపాన్ని మార్చడమేనని ఆయన వాదించారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎస్‌ఎన్‌ సిక్రీ నేతృ త్వంలో 13మంది న్యాయమూర్తుల ధర్మాసనం 68 రోజుల పాటు విచారణ జరిపింది. దేశంలో ఒక పిటిషన్‌ పై ఇంత అధిక సంఖ్యలో న్యాయమూర్తులు విచారణ జరిపిన తొలి కేసు ఇదే. ఈ తీర్పులో ఆ ధర్మాసనం రాజ్యాంగంలో మార్పులు చేసే అధికారం పార్లమెంటు కు ఉన్న మాట నిజమే కానీ, రాజ్యాంగం మౌలిక రూపాన్ని మార్చే అధికారం స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఈ తీర్పును కోర్టులు ప్రామాణికంగా తీసుకుం టున్నాయి. కేశవానంద భారతి వర్సెస్‌ కేరళ ప్రభుత్వం అనే పేరిట గల ఈ తీర్పు విదేశాల్లో కూడా చట్టపరమైన తీర్పులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. బంగ్లాదేశ్‌, ఉగాండా, సీషల్స్‌ వంటి దేశాల్లో ఈ తీర్పు అక్కడి పరిస్థితులకు అక్కడి న్యాయస్థానాలకు స్ఫూర్తిగా నిలిచింది. పాకిస్తాన్‌ లో ప్రజాస్వామ్య పాలనను అంతం చేసి అధికారాన్ని చేపట్టిన నియంతలు రాజ్యాంగాన్ని మార్చేసి, తమకు అనుకూలంగా రాసుకున్నారు. చైనాలో ప్రస్తుత అధ్యక్షు డు జిన్‌పింగ్‌, రష్యాలో అధ్యక్షుడు పుతిన్‌ శాశ్వత అధ్యక్షులుగా కొనసాగేందుకు వీలుగా రాజ్యాంగాన్ని మార్చుకున్నారు.

మన దేశంలో అటువంటి అవకాశాలు లేవు. అయితే, రాజ్యాంగాన్ని పక్కదారి పట్టించే ప్రయ త్నాలు మనదేశంలోనూ జరుగుతున్నాయి. కానీ, వెంటనే మేధావులు, న్యాయకోవిదులు జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారు. కేశవానంద భారతికి అంత పేరు రావడానికి ఆయన సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం జరపడం కారణం. అందుకే ఆయనను రాజ్యాంగ రక్షకుడని కీర్తించారు. ఈ పోరాటంవల్ల ఎడ్‌నీర్‌ మఠం భూముల విషయం పక్కనబెడితే, రాజ్యాంగం విషయంలో పార్లమెంటుకున్న అధికారాల విషయంలో ఒక స్పష్టత ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఎన్నో గోష్టులు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. పాలకులు యథేచ్ఛగా రాజ్యాంగాన్ని చాపచుట్టే ప్రయత్నాలు చేయకుండా ఈ తీర్పు అడ్డుకట్ట వేసింది. ఈ తీర్పు వెలువడిన రెండేళ్ళకే అంటే 1975లో ఎమర్జెన్సీ హయాంలో రాజ్యాంగం మౌలిక సూత్రాలను మార్చే ప్రయత్నాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి.

అప్పట్లో రాజ్యాంగ కోవి దులు అరెస్టులను సైతం లెక్క చేయకుండా నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా ఇప్పటికీ పిలవబడుతు న్న ఎమర్జెన్సీ కాలంలో పౌరుల హక్కులను హరించే ప్రయత్నాలు జరిగాయి. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నేతృత్వంలో ప్రజాస్వామ్య వాదులు అరెస్టు లకు వెరవకుండా ధైర్యంగా పోరాడారు. మన దేశంలో ఎమర్జెన్సీ ఛాయలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయని ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకా నికి ఏర్పాటైన కొలీజియం వ్యవస్థపై పార్లమెంటు లోనూ, వెలుపలా విమర్శలు చేసినప్పుడల్లా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని కొలీజి యం వ్యవస్థ ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నారు. ప్రజలెన్నుకున్న పార్లమెంటుకు విశేషాధికారాలున్నా యని వాదించేవారున్నారు. ఆ మాట నిజమే కానీ, అప్పుడూ, ఇప్పుడూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నవి న్యాయస్థానాలే.

Advertisement

తాజా వార్తలు

Advertisement