Saturday, May 4, 2024

ష‌ర్మిల‌కు ష‌రతులతో బెయిల్ …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోలీసుల దాడికేసులో వైఎస్‌ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. బెయిల్ ఇచ్చే ముందు కొన్నిష‌ర‌తులు విధించింది. కేసు గురించి ఎటువంటి వ్యాఖ్యాలు చేయ‌రాదని, పోలీసుల విచార‌ణ‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా హాజ‌రు కావాల‌ని ష‌ర్మిల‌కు కోర్టు సూచించింది.. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ 30వేల రూపాయిల డిపాజిట్ తో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇది ఇలా ఉంటే ఆదివారం ఉదయం టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో తనకున్న అనుమానాలను సిట్‌ అధికారులకు వివరించేందుకు బయలు దేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో లోటస్‌ పాండ్‌ దగ్గర హైడ్రామా కొనసాగింది. పోలీసులకు షర్మిల మధ్య వాగ్వివాదం తోపులాట జిగింది. పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను షర్మిల తోసివేశారు. షర్మిల తనకారును పోలీసులపైకి వెళ్లనీయగా ఓ కానిస్టేబుల్‌ కాలుకు తగిలింది. దీంతో షర్మిలను పోలీసులు అరెస్టు చేసి జూబ్లి హిల్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విని రిమాండ్‌ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఎస్‌ఐ, లేడీ కానిస్టేబుల్‌పై షర్మిల చేయి చేసుకున్నారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ న్యాయమూర్తి ముందు వాదనలు వినింపించారు. షర్మిలను రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తిని కోరారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షర్మిలకు రిమాండ్‌ విధించారు.

లోటస్‌ పాండ్‌ వద్ద జరిగిన ఘటనలో షర్మిలపై పోలీసులు 332, 353, 509, 427 ఐపీసీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. అనంత‌రం కోర్టు వాద‌న‌లో రిమాండ్‌కు పంపకుండా బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తునకు సహకరిస్తామని షర్మిల పక్షాన న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో షర్మిలను పోలీసులు నేరుగా చంచలగూడ జైలుకు తరలించారు. దీంతో ష‌ర్మిల బెయిల్ కోసం నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు.. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి ష‌రతుల‌తో బెయిల్ మంజూరు చేశారు.. దీంతో ఈరోజే ష‌ర్మిల చంచ‌ల్ గూడ
జైలు నుంచి విడుద‌ల కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement