Thursday, April 25, 2024

కారులో త‌మ‌న్నా.. విజ‌య్ వ‌ర్మ‌.. ఇప్పుడేమంటారో

గ‌త‌కొన్ని రోజులుగా టాలీవుడ్‌ హీరోయిన్‌ తమన్నా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ డేటింగ్ లో ఉన్నార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయిద‌. కాగా తాజాగా ముంబైలో వీరిద్దరూ ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేసినట్లు తెలుస్తుంది. ఇక డిన్నర్‌ తర్వాత వీరిద్దరూ ఒకే కారులో వెళ్లారు. తమన్నా కారు ఎక్కుతున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీస్తుంటే హాయ్‌ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దాంతో పలువురు నెటిజన్లు వీరిద్ధరూ రిలేషన్‌లో ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తమన్నా చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్‌’ కూడా ఒకటి. ఇక తమన్నా, విజయ్‌ వర్మలు కలిసి ‘లస్ట్‌ స్టోరీస్‌-2’లో నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ళు డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వచ్చాయి.మ‌రి ఈ వార్త‌ల‌పై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement