Thursday, April 25, 2024

ఎడిటోరియ‌ల్ – ఆర్థిక స‌ర్వే ఆశాజ‌న‌క‌మేనా?

జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆర్థిక శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రజల ముందుంచిన అంశాలే కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే లో చోటు చేసుకున్నాయి. కేంద్ర బడ్జెట్‌కి ఒక రోజు ముందు ఆర్థికసర్వే నివేదికను కేdంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఓ ఆనవాయితీ..ఈఏడాది వృద్ధి రేటు ఏడు శాతం ఉండవచ్చనీ, వచ్చే ఏడాది అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అది 6.5 శాతానికి పరిమితం అవుతుంద ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పర్చే జింగ్‌ పవర్‌ ప్యారటీ ప్రకారం చూస్తే ప్రపంచంలోనే మనది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ఆమె అన్నా రు. అంటే, అభివృద్ది చెందుతున్న దేశాల్లో మూడో స్థానా న్ని సాధించేందుకు మన దేశం ముందుకు సాగుతోంద న్న మాట.మంచిదే.అదే దామాషాలో ప్రజలకొనుగోలు శక్తి పెరగాలి. కానీ, పెరగడం లేదు. అలాగే, అధిక ధరల కారణంగా పొదుపు తగ్గింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వృద్ధి రేటు 6.5 శాతానికి చేరుకోలేకపోవచ్చు.

ధరల పెరుగుదలకు ఆర్థిక కారణాల కన్నా రాజకీయ కార ణాలే ఎక్కువ ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్థికాభివృద్ధి సార్థకమై నట్టు. ప్రపంచ దేశాలను తీవ్రంగా వణికించిన మహ మ్మారి కరోనా మిగిల్చిన నష్టాలనుంచి నెమ్మదిగా కోలు కుంటున్న వేళ,ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి ప్రభావం అన్ని దేశాల మీదతో పాటు మన దేశం మీద కూడా ఉంది. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకున్న దేశాల్లో మన దేశంచెప్పుకోదగిన స్థానంలో ఉంది.మన ఆర్థిక వ్యవస్థ పై కోవిడ్‌ వంటి అసాధారణపరిస్థితులు ఒక కారణమైతే, అంతకుముందు పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల ప న్ను (జీఎస్‌టీ) ప్రభావం రెండోది.కోవిడ్‌ వల్ల అన్ని దేశాలూ నష్టపోయాయి కనుక,దానిని సరిపెట్టుకోవల్సిందే తప్ప ఎవరూఏమీ చేయలేని స్థితి, కానీ, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కేవలం మన దేశానికే పరిమితమైన కారణాలు. కరోనా ప్రభావం వల్ల ఇతర దేశాలకు వాటిల్లిన నష్టాల కన్నా మన దేశంలో నష్టాలే తక్కువ.అయితే, మన దేశంలో శ్రామిక, కార్మిక వర్గాలు ఇంకా కరోనా దెబ్బ నుంచి కోలు కోలేదు. ఎగుమతులు పుంజుకోకపోవడం మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇతర దేశాల్లో సైతం కొనుగోలు శక్తి తగ్గడం వల్ల మన దేశం నుంచి దిగు మతులను అవి తగ్గించేశాయి.ప్రపంచ ఆర్థిక కార్యకలా పాలు మందగించడం వల్ల మన ఎగుమతులపై దాని ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయా ర్ధంలో ఎగుమతులు నెమ్మదించాయి.


గతంలో అమె రికాకు మన దేశం నుంచి ఎగుమతులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అమెరికాలో ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా మన దేశం నుంచి ఎగుమతులు తగ్గాయి.అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాలపై పడిం ది. ఎంతో ప్రతిష్టాత్మక కంపెనీలుగా పేరొందిన గూగుల్‌, మైక్రో సాఫ్ట్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగులను బాగా తగ్గించారు. దాని ప్రభావంతో అమెరికాలో స్థిరపడిన భారతీయ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు మాతృ దేశానికి తిరిగి వచ్చారు. వారికి ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వంపై పడింది. అమెరికాకి చెందిన ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుండటం వల్ల మనరూపా యి మారక విలువ మరిన్న సవాళ్ళను ఎదుర్కోవచ్చు. ఇప్పటికీ డాలర్‌ విలువ 82 రూపాయిలు పలుకుతోంది. వివిధదేశాల్లో కమోడిటీ ధరలు అత్యధికంగా ఉన్న కార ణంగా కరంట్‌ ఖాతా మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కరోనా కేసుల విజృంభణ వల్ల ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. అయితే, మన దేశంలో భారత్‌ సహా పలు దేశాల్లో సప్లయి చెయిన్‌లు యథాత థంగా కొనసాగవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగవచ్చ ని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆర్థిక మాంద్యంగురించి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వంటి అంతర్జాతీయ సంస్థలు ముందే హెచ్చరించాయి.


వాటితో పోలిస్తే మన దేశంలో పరిస్థితికొంత మెరుగే. అయినప్పటికీ వచ్చే ఏడాది వృద్ధిరేటు 6.5 శాతం దాటక పోవచ్చని అంచనా. మన దేశం లో ద్రవ్య వినియోగం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ సంపన్న వర్గాలకే అభివృద్ధి ఫలాలు దక్కుతున్నాయని అందరి నోటా వినిపిస్తున్న మాట. సమ్మిళిత అభివృద్ధి జరిగితేనే పేద వర్గాలకు న్యాయం జరిగినట్టు.ఈ విష యాన్ని పాలకులు గుర్తుంచుకోవల్సిన అవసరం ఉంది. ఆర్థిక సర్వే సాధారణ బడ్జెట్‌కు అద్దం పడుతుందని ప్రజలు ఆశిస్తుంటారు. కానీ ఈ సర్వే నివేదిక పరిశీలిస్తే బడ్జెట్‌లో ప్రజలకు అవసరమైన ఆమోదయోగ్యమైన అంశాలేమీ ఉంటాయని ఆశించడానికి అవకాశం కలగడం లేదు. ఎందుకంటే ప్రజల యొక్క ఆశావహ పరి స్థితులు ఈ సర్వేలో ఎక్కడా పొందుపర్చలేదు. అయితే ఎన్నికల సంవత్సరం కనుక బడ్జెట్‌లో కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement