Thursday, March 28, 2024

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో 10 మందికి జైలు శిక్ష..

తాగి వాహ‌నం న‌డ‌ప‌డం నేరం.. వీరు చేసే త‌ప్పిదాల‌కు రోడ్డుపై ఇత‌ర వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డాల్సిన ప‌రిస్థితి. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌మాదాలు చోటుచేసుకుని ప్రాణాలు సైతం కోల్పోతారు. న‌గ‌రంలో రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించాల‌నే ల‌క్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ డ్రైవ్ నిర్వ‌హించారు. రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడ్డ 10 మంది వాహనదారులకు రెండు రోజుల నుంచి 5 రోజుల వరకు జైలు శిక్ష పడింది. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులను పరిశీలించిన రాజేంద్రనగర్‌ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి నజీరుద్దీన్‌ ఈ శిక్షలు విధించారు. పది మందిలో ఇద్దరికి ఐదు రోజులు, ముగ్గురికి నాలుగు రోజులు, నలుగురికి మూడు రోజులు, ఒకరికి రెండు రోజుల పాటు శిక్ష విధించారు. బీఏసీ రీడింగ్‌ ఆధారంగా ఈ శిక్షలు పడ్డాయని రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement