Wednesday, May 8, 2024

ఎడిటోరియ‌ల్ – ఈసి స్వ‌తంత్ర‌ను కాపాడాలి..

ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయిన ఎన్నికలను నిష్పాక్షికంగానూ, నిజాయితీగానూ నిర్వహించాలి. కానీ, ఇప్పుడు మన దేశంలో అలా జరగడం లేదని మేధావులు చాలాకాలంగా అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం తన అభిప్రాయాలను ఇదే రీతిలో వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగపరిస్తే ప్రజాస్వామ్యం సమాధి అవుతుందనీ, దాని పరిణామా లు తీవ్రంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హెచ్చరించింది. గతంలో కూడా ఎన్నికల సంఘంలో కమిషనర్లను నియమించే తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పెద్దలకు జీహుజూరు అనే వారిని కాకుండా, ఎన్నికల కమిషనర్లను ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకు డు, సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమించాలని సూచిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సమయం వచ్చినప్పుడల్లా ఎన్నికల సంఘాన్ని రాజ్యాం గబద్దమైన సంస్థ అని అధికారంలో ఉన్న పెద్దలు అభివ ర్ణిస్తుంటారు, కానీ, రాజ్యాంగానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తున్నామా?అని ఆత్మవిమర్శ చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని జస్టిస్‌ కెఎం జోసెఫ్‌,జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ,జస్టిస్‌ రవి కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఎన్నికల కమిషనర్ల నియామకంలో కార్యనిర్వాహక వర్గం అధికారాన్ని చలాయించడం రాజ్యాంగంలోని 324 (2) అధికరణాని కి విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది.ప్రస్తుతం అను సరిస్తున్న విధానాన్ని మార్చి కొలీజియం తరహా విధానా న్ని ప్రవేశపెట్టేట్టు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గత నవంబర్‌లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచిం ది. ఇప్పుడు ఆ తీర్పును వెలువరించింది. ప్రధాన ఎన్నిక ల కమిషనర్‌ నియామకానికీ,తొలగింపునకూ అనుసరిం చే విధి విధానాలనే ఇతర కమిషనర్లకూ వర్తింపజేయాల ని సుప్రీంకోర్టు సూచించింది .ఎన్నికల సంఘం నిధుల కోసం ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి తొలగి పోతేనే ఆ సంఘం స్వతంత్రంగా పని చేయగలదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకం విష యంలో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతుంటాయి. దీని వల్ల ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతపై ప్రభుత్వం స్థిరమైన నిర్ణయాలను తీసుకొ లేకపోతోంది. కొలిజియం తరహా ఏర్పాటు చేయాలన్న సూచనపై మాజీ ప్రధాన కమిషనర్లలో భిన్నాభిప్రాయా లు వెల్లడయ్యాయి.

ఇది మంచిదేనని గిల్‌,ఎస్‌వై ఖురేషీ వంటి మాజీ ప్రధాన కమిషనర్లు స్పష్టం చేయగా,ఇది ఎన్నికల వ్యవస్థలోన్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడమే అవుతుందని కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి మల్హోత్రా అన్నారు. ప్రభుత్వానికి అడుగులకు మడుగు లొత్తే అధికారులుగా ఎన్నికల కమిషనర్లు మారిపోతు న్నారన్న విమర్శలు గతంలోనూ వచ్చాయి.టిఎన్‌ శేషన్‌ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నప్పుడుఎన్నికల సంఘం లో సంస్కరణలను ప్రవేశపెట్టారు.ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిర్ణయాలు చేసేవారు. తనకు రాజ్యాంగమే ప్రామాణికమని ఆయన తరచూ స్పష్టం చేసేవారు. ఎన్నికల సంఘం ఆర్థిక వనరుల కోసం ప్రభు త్వంపై ఆధారపడే పద్దతి పోవాలని అప్పట్లోనే ఆయన నిష్కర్షగా స్పష్టం చేశారు.నిధుల కోసం ప్రభుత్వం వెంట పడటం, అర్థించడం వంటి పద్దతులు పోవాలని ఆయన అప్పట్లో చాలా ఖండితంగా స్పష్టం చేశారు. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం కూడా అదే మాట స్పష్టం చేసింది.

ఎన్నికల సంఘంలో సభ్యుల సంఖ్యను మూుడుకు పెం చింది కూడా ఆయన హయాంలోనే. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని తరచూ అంటూంటా రు. కానీ, ఎన్నికలసంఘానికి ఎటువంటి స్వాతంత్య్రం లేదని ఆనాడే శేషన్‌ స్పష్టం చేశారు. తాము తీసుకునే నిర్ణయాల్లో ప్రభుత్వం వేలు పెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు అదే అభిప్రాయాన్ని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. స్వతంత్ర సంస్థకు నేతృత్వం వహిస్తున్న అధికారి అధికారంలో ఉన్న వారికి బానిస కారాదనీ, చట్టాల ఉల్లంఘనలో అధికారంలో ఉన్న వారి కి తోడ్పాటును అందించరాదని ధర్మాసనం స్పష్టం చేసిం ది. ప్రజాస్వామిక సంస్థలపై విశ్వాసాన్ని పెంపొందిం చాలే తప్ప అందుకు విరుద్ధంగా వ్యవహరించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.గతంలోఎన్నికల సంఘాన్ని అధికారంలో ఉన్న వారు గుప్పిట్లో పెెట్టుకుని ఎన్నికల నిర్వహణలో తమ ఆదేశాలు పాటించబడేట్టు చూసుకునే వారు. ఆ పద్ధతి మారడం కోసమే కొలిజియం వ్యవస్థ తరహా ఏర్పాటు కావాలని రాజ్యాంగ ధర్మాసనం సూచిం చింది. ఎన్నికల సంఘం ఆదేశాలను తేలిక చేసే చర్యలను ప్రభుత్వాలు తీసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. ప్రస్తుతం ఇలాంటి ధోరణలను చూస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement