Saturday, April 27, 2024

మత్స్యావతారుడిగా యాదాద్రీశుడు

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌: పంచనృసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రిశ్రీ లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో శ్రీ స్వామివారిబ్రహ్మోత్స వాలు అత్యంతవైభవంగా జరుగు తున్నాయి. మూడవ రోజు ఆలయంలో అలంకారసేవలు ప్రారంభ మయ్యాయి. అలంకార ప్రియుడైనశ్రీలక్ష్మీ నృసింహు డిని దశావ తారాల్లొ ఒకటైన శ్రీ మత్స్యావ తారుడిగా అలంకరించి ఊరేగించారు. సత్యవ్రతమహారాజు వేదాలను అపహరించిన సోమకున్ని సంహరించి మత్స్యావ తారుడిగా వేదాలను రక్షించిన అవతారంగా చెప్పబడుతుంది. మత్స్యావతా రుడిగా అలంకరించి శ్రీ స్వామి వారిని వేదమంత్రాలు.. సన్నాయి వేళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య బాలాల యంలో భక్తుల దర్శనార్ధం ఊరేగించారు. భక్తులు శ్రీ స్వామి వారిని దర్శించి తరిం చారు. రాత్రి 9 గంటలకు శ్రీ స్వామి వారిని సేవ వాహన సేవ పై ఊరేగించారు. ఆల య ప్రధానార్చకులు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, మరింగటి మోహనా చార్యులు, అర్చక బృందం ఉత్సవ కార్యక్రమాలకు నిర్వహించారు. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి నర్సింహామూర్తి, ఈవో ఎన్‌ గీత, ఏఈవోలు గజవెల్లి రమేష్‌బాబు, వేముల రాంమోహన్‌, దోర్భల భాస్కరశర్మ, గట్టు శ్రవణ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ గజవెల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement