Wednesday, May 8, 2024

ధర్మం మర్మం – మార్గశిరమాస విశిష్టత

హస్రం శతవారం వా యధాశక్తి జపేన్మనుమ్‌ |
మనసైవార్చనం కృత్వా తతో విధి వదాచరేత్‌ ||

సంప్రదాయానురోధేన శంఖం స్థాప్య మమాగ్రత: |
దూర్వాంకురైశ్చ పుష్పైశ్చ గంధోదేన చ పూరితమ్‌ ||

దక్షిణ గంధ పుష్పాణాం పాత్రం స్థాప్యచ దేశికై: |
వామ భాగేన్యసేత్కుంభం వస్త్రపూతం సువాసితమ్‌ ||

పురతో మమ ఘంటాంచ దిక్షు దీపాన్నియోజయేత్‌ |
అన్యత్సర్వం సాధనంచ యధాస్థానేషు విన్యసేత్‌ ||

అర్ఘ్య పాద్యాచమనీయ మధుపర్కస్య కారణాత్‌ |
విన్యసేత్పురతో మహ్యం చత్వార్యమత్రకాణిచ ||
మంత్రమును వేయిమార్లు కాని నూరుమార్లు కాని యధాశక్తి జపించవలయును. మనసుతోనే ఆరాధన చేసి ఆ తరువాత యధావిధిగా ఆచరించవలయును. సంప్రదాయానుసారముగా శంఖమును నాముందు స్థాపించి ఆ శంఖమును దూర్వాంకురములతో, పుష్పములతో, గంధోదకముతో నిలుపవలయును. శంఖమునకు దక్షిణ భాగమున దేశికులు, గంధపుష్పముల పాత్ర నుంచి ఇక వామభాగమున చక్కగా సువాసితమైన వస్త్రపూతమైన కుంభమునుంచవలయును. నా ముందర ఘంటను, నాలుగు దిక్కులలో దీపములలోనుంచవలయును. ఇతర సకల సాధనములను యధా స్థానములలో నుంచవలయును. అర్ఘ్యపాద్య ఆచమనీయ మధుపర్కముల కొరకు నాలుగు పాత్రల నుంచవలయును.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement