Saturday, April 27, 2024

దక్షిణాదిలో దివ్యక్షేత్రంగా శ్రీరామనగరం

హైదరాబాద్‌, ప్రభ న్యూస్ : త్రిదండి శ్రీమన్నారాయణ రామా నుజ చినజీయర్‌ సారథ్యంలో నిర్వహిస్తున్న శ్రీరామనగరం భవిష్యత్తులో దక్షిణ భారత దేశంలోనే విశిష్ట దివ్యక్షేత్రంగా విరాజి ల్లు తుందని, ఈ క్షేత్రాన్ని సందర్శించిన తరువాత దివ్యానుభూతి కలిగిందని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్ఛిదానంద స్వామీ జీ అన్నారు. భక్తులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని అద్భుత అను భూతికి లోనవుతారని అన్నారు. సమతా మూర్తితో పాటు 108 దివ్యక్షేత్రాల స్థాపనతో చినజీయర్‌ చరిత్ర సృష్టించారని అన్నారు. వీలైనప్పుడల్లా ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని సందర్శించి రామాను జాచార్యులవారి స్ఫూర్తిని పొందాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాలకు ఇది మకుటంగా మారబోతోందని, తెలంగాణలో ఏర్పా టు చేయడం మరీ గొప్ప విశేషమని అన్నారు. హిమాలయాల్లో మార్తాండ మందిరంలో రథసప్తమి వేడుకల్లో పాల్గొని నేరుగా శుక్రవారంనాడు భగవద్రామానుజుల సహస్రాబ్ది సమా రోహం కార్యక్రమానికి విచ్చేసిన ఆయన శ్రీమన్నారాయణ యాగంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన 216 అడుగుల రామాను జుల విగ్రహాన్ని, 108 దివ్యక్షేత్రాలను తిలకించారు. అనంత రం యాగశాలకు చేరుకుని శ్రీమన్నారాయణ యాగంలో పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అశేష భక్తజ నవాహినిని ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. కర్నాటకలోని మేల్కోటే క్షేత్రంతో రామా నుజులవారికి సంబంధం ఉందని, దత్తాత్రేయుడు, రామా నుజులు వేరుకాదని అన్నారు. ఈ సందర్భంగా చినజీయర్‌ స్వా మి మాట్లా డుతూ గణపతి సచ్చిదానంద స్వామివారికి తామం టే అపేక్ష అని, ఆ ప్రేమతోనే ఇక్క డకు వచ్చారని అన్నారు. భగ వద్రా మా నుజుల వారికి అత్యం త ప్రీ తిపాత్ర మైన క్షేత్రం మేల్కొటే అని, అక్కడి దత్త పుష్కరిణివద్దే ఆయన సన్యాసం స్వీకరించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామీజీని చినజీయర్‌ శాలువతో సన్మానించారు. శ్రీరామానుజప్రతిమను అందజేశారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రవచన మండపంలో పొన్నాల వెంకటేశ్‌ రామానుజ భజన గీతాలు ఆలపిం చారు. ఉభయ వేదాంతాచార్యులు కందాడై శ్రీనివాసా చార్యులు రామానుజా చార్యుల వైభవంపై ప్రసంగించారు. విజయ నగరం జిల్లా గంట్యాడ నేత్రవిద్యాలయ విద్యార్థులు శ్రీరామా నుజ నూత్తందాది కార్యక్ర మాన్ని నిర్వహంచారు. సాయి భావన గీతాలాపన, శ్రీమతి బిందు బృందం కూచిపూడి నృత్యం,సురభి రాయలవారిబృందం రామానుజాచార్యుల నాట కం, వారాహరి నృత్య అకాడమీకి చెందిన ఆది లక్ష్మి బృందం కూచిపూడి నృత్యం, శ్రీదేవి సిస్టర్స్‌గానం, శ్రీమతిజ్వాలా ముఖినృత్యం, యుగంధర్‌ స్వా మిగానం, చిరంజీవి ఆమోద్‌ భగవద్గీత శ్లోకాలు ఆకట్టుకు న్నాయి. తెలంగాణ సాంస్కృతి కశాఖ ఆ ధ్వర్యంలో ఫణిస్వామి నేతృత్వ ంలో సహస్ర కూచిపూడి అభినయం ఆకట్టు కుంది. 2 వేల మంది చిన్నారుల కూచిపూడి నృత్యం అందరినీ కట్టిపడేసింది.
ఇవాళ తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి , వైసీపీ ఎమ్మెల్యే రోజా 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. యాగశాలలో పూజలు చేశారు. దేవాదాయశాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ పూజల్లో పాల్గొన్నారు.

అంగరంగవైభవంగా సహస్రాబ్ది
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో అంగరంగ వైభవంగా కొనసా గుతున్నాయి. మహాక్రతువులో భాగంగా 10వ రోజు, శుక్రవారం నాడు యాగశాలలో ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీనారాయణ మహా యాగాన్ని వేదపండితులు నిర్వహించారు. 5 వేల మంది రుత్విజులు వేదమంత్రాలు చదువుతుండగా స్వచ్ఛమైన ఆవునెయ్యితో హో మ క్రతువును నిర్వహించారు. దివ్య ప్రబంధాలు, భగవద్గీత లోని ప్రధాన అధ్యాయాలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉజ్జీవన యజ్ఞం పూర్తిచేశారు. విద్యాప్రాప్తి కోసం హయగ్రీవ ఇష్టిని నిర్వహించారు. ఉదయం సామూహక ఉపనయనాలు చేశారు. ప్రవచన మండపంలో అహూబిల రామనుజజీయర్‌ స్వామి భక్తుల తో లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించారు. రామచంద్ర జీయర్‌ స్వామి భక్తులతో పూజను చేయించారు. సుమారు రెండు వేల మంది భక్తులు పూజలో పాల్గొన్నారు.

నేటి కార్యక్రమాలు
రామానుజుల సహస్రాబ్ది సమారోహంలో 11వ రోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారంనాడు పరవాసుదేవ పూజ నిర్వహిస్తారు. రోజువారీ శ్రీమన్నారాయణ క్రతువు, అష్టాక్షరీ అనుష్టానం, విష్ణుసహస్రనామ పారాయణ ఉంటాయి. పితృదేవతల తృప్తి, అనారోగ్య సమస్యలనుంచి కోలుకుని స్వస్థత పొందేందుకు పరమేష్టి, ఆటంకాల తొలగించి విజయాన్ని అందించాలన్న సంకల్పంతో వైభవేష్టి నిర్వహిస్తారు.

36 విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ
సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగ ణంలో 108 దివ్యదేశాల లోని 36 ఆలయాలకు త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమం లో మైహూంగ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. శుక్రవారం ప్రాణప్రతిష్ఠ జరిగిన ఆలయాలలో తంజమామణిక్కోయల్‌, తిరువాదనూరు, శిరుపులియూర్‌, తిరువిణ్ణగార్‌, తిరుక్కణ్ణాపురం, తిరునఱౖ యూర్‌, తిరుక్కూడలూర్‌, తిరుకణ్ణాంగుడి, తిరుకణ్ణామంగై, తిరువెళ్లి యాంగుడి, అరిమేయ విణ్ణాగరమ్‌, తిరుత్తేవ నార్‌ తొగై, వణ్‌ పురుషో త్తమ్‌, తిరువక్కావళంబాడి, తిరువెళ్లక్కుళమ్‌, శ్రీవిల్లిపుత్తూరు, తెన్‌ మదురైతిరుత్తొలైవిల్ల మంగళమ్‌, తిరు శిరివర మంగై, తిరుప్పుళిం గుడి, తెన్‌ తిరుప్పేర్‌, శ్రీవైకుంఠమ్‌, తిరు వరగుణ మంగై, తిరుక్కు ళందై, తిరుక్కురుంగుడి తిరు క్కంచి, తిరువణ్‌ పరిశారమ్‌, తిరు చ్చెంకున్ఱూర్‌, తిరునా వా య్‌, తిరువణ్‌ వండూర్‌, తిరుమో గూర్‌, తిరు విత్తువక్కోడు, తిరువారన్‌ విళైతిరునీరగమ్‌, తిరు వెంకా, తిరుకారగమ్‌, తిరువేంగడమ్‌ ఉన్నాయి. మరి కొన్ని ఆల యాలకు ఈనెల 13న ప్రాణ ప్రతిష్ట జరగ నుంది. ఇప్ప టికే అత్యధిక ఆలయాలకు ప్రాణ ప్రతిష్ట జరగడం వల్ల భక్తులు వేలాదిగా తర లివచ్చిదివ్య దేశాలనుదర్శిం చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement