Friday, May 10, 2024

న‌డిరోడ్డుపై బాలిక‌పై దాడి – ఆధారంగా సీసీ ఫుటేజ్

ఓ అమ్మాయిపై న‌డిరోడ్డ‌పై తీవ్రంగా దాడికి పాల్ప‌డ్డాడు ఓ వ్య‌క్తి. క‌ర్ర‌,బూటుతో విచ‌క్ష‌ణార‌హితంగా ఆ అమ్మాయిని కొట్టాడు. ఈ సంఘ‌ట‌న ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఢిల్లీ వుమెన్స్ క‌మిష‌న్ పోలీసుల‌ను ఆదేశించింది. ఆ బాలిక‌ను ప‌ట్టుకుని కర్రతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. విడిపించుకోవాలని బాధితురాలు ఎంత ప్రయత్నించినా ఆమెను వదల్లేదు. ఆ తర్వాత కాలికి ఉన్న బూటుతో నిర్దాక్షిణ్యంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనపై స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్.. డిసిడబ్ల్యూకి ఫిర్యాదు చేసింది. సిసిటీవీ ఫుటేజ్ ను సైతం అందించింది. నిందితుడిని డ్రగ్స్ కి బానిసగా పేర్కొన్న అసోసియేషన్ ఆ అమ్మాయిని కొందరు బంధించినట్లు తెలిపింది.

ఆ బాలిక జీవితం ఆపదలో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై డిసిడబ్ల్యూ సీరియస్ గా స్పందించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయాలంటూ కమిషన్ చీఫ్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు, అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని స్పష్టం చేశారు. బాలికను రక్షించిన తర్వాత ఆమెకు భద్రత కల్పించాలని కోరారు. ఘటనకు గల కారణాలను తెలుసుకోవాలి అని.. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన.. సమగ్ర నివేదికను 48 గంటల్లోగా కమిషన్ కు అందజేయాలని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement