Sunday, May 5, 2024

క్రిఎ్టో కరెన్సీపై పన్ను విధిస్తాం! కేంద్రానికి ఆ హక్కు ఉంది : నిర్మలా సీతారామన్‌..

క్రిఎ్టో కరెన్సీ లావాదేవీల నుంచి ఆర్జించే లాభాలపై పన్ను విధించేహక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అయితే క్రిఎ్టో కరెన్సీని నిషేధించాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం పడుతుందని రాజ్యసభలో ఆమె తెలిపారు. 2022-23 బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా సీతారామన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా క్రిఎ్టో పన్ను విషయంపై ఆమె మాట్లాడుతూ క్రిఎ్టో కరెన్సీ లావాదేవీలు చట్టబద్దమా కాదా అనే విషయం పక్కనపెడితే ఆ లావాదేవీల ద్వారా పొందే లాభాలపై పన్ను విధిస్తాం. కేంద్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. ఈ విషయంపై క్రిఎ్టో కరెన్సీ నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. వారి నుంచి నివేదిక అందింన తర్వాత నిషేధంపై తగిన నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని రాజ్యసభ వేదికగా నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

కాగా ఈ నెల 1న ప్రవేశపెట్టిన 2022-23 కేంద్ర బడ్జెట్‌లో క్రిఎ్టో లావాదేవీలపై 30శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణే లక్ష్యంగా 2022-23 బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థికమంత్రి నిర్మలా తెలిపారు. వందేళ్ల స్వత్రంత్ర భారత్‌ను దృష్టిలో ఉంచుకుని రానున్న 25ఏళ్లకు ప్రణాళికలు రూపొందించామన్నారు. రాబోయే పాతికేళ్లు దేశానికి చాలా కీలకమన్నారు. రాబోయే కీలక సమయంపై దృష్టి సారించకపోతే స్వాతంత్య్రం వచ్చిన తొలి 70ఏళ్లలో ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు మరోసారి ఎదుర్కొవాల్సి వస్తుందని పరోక్షంగా గత కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. గత ప్రభుత్వాలు సాధించలేని ఆర్థిక ప్రగతి ఈ ఏడేళ్లలో సాధించినట్లు ఆమె వివరించారు. 2008-09లో ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తినపుడు దేశంలో రిటైల్‌ ద్రవోల్బణం 9.1శాతం ఉందని అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని 6.2శాతానికి తగ్గించగలిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement